కలిగిరి మార్కెటింగ్ యార్డులో 250 బస్తాల ధాన్యం అపహరణ -దర్యాప్తు చేపట్టిన కలిగిరి సి.ఐ రవికిరణ్....

*కలిగిరి మార్కెటింగ్ యార్డులో 250 బస్తాల ధాన్యం అపహరణ* దర్యాప్తు చేపట్టిన కలిగిరి సి.ఐ రవికిరణ్.... ఉదయగిరి, మే 3 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోకవర్గంలోని కలిగిరి మండలం జిర్రావారిపాళెం మార్కెటింగ్ యార్డులో రైతులు నిల్వ ఉంచిన దాదాపు 250 ధాన్యం బస్తాలు శనివారం రాత్రి అపహరణకు గురయ్యాయి. ఆదివారము తెల్లవారుజామున రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెటింగ్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తదుపరి అధికారులు, రైతులు కలిగిరిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే కలిగిరి మండలంలోని జిర్రావారిపాళెం మార్కెట్ యార్డులో రైతుబంధు పధకం కింద జలదంకి మండలంలోని బ్రాహ్మణకాక గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సుబ్బరత్నమ్మ అనే రైతులు 2018లో ధాన్యం నిల్వ చేశారు. అందుకు సంబంధించి వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిపాజిట్ నగదును పొందారు. అయితే ఇటీవల ఆశించిన ధర రావడంతో నిల్వ ఉంచిన ధాన్యమును విక్రయించుకునేందుకు రైతులు సన్నద్దమయ్యారు. మార్కెటింగ్ శాఖ అధికారులకు డిపాజిట్ గా తీసుకున్న నగదును చెల్లించారు. ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అధికారుల అనుమతితో ఆదివారం ఉదయం సదరు రైతులు మార్కెట్ యార్డుకు తరలివెళ్ళిన సమయంలో షట్టర్లు తీయగా ధాన్యం కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న వారు ఈ విషయమును మార్కెట్ కమిటీ అధికారులకు తెలియపరిచారు. వారు వచ్చిన అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కలిగిరి సి.ఐ రవికిరణ్, ఎస్.ఐ వీరేంద్రబాబులు మార్కెట్ యార్డుకు వెళ్ళి పరిశీలించారు. ధాన్యం మాయమైన తీరు పట్ల యార్డులో ఉన్న పలువురిని ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఈ సందర్భంగా సి.ఐ రవికిరణ్ విలేకరుల సమావేశంలో  తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు