ఎండలో సైతం సేవలో.. విధి నిర్వహణలో వాలెంటేర్లు.

ఎండలో సైతం సేవలో..


విధి నిర్వహణలో వాలెంటేర్లు..


కావలి,
ప్రజ సేవలో నిరంతరం కష్టపడుతున్న సమాజ సేవకులు వారు..ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుగు ముగింట్లో అందించే నవ సేవకులు వారు.. ప్రజలకు సంక్షేమం గురించి పాఠాలు వలించే చైతన్యం దీపికాలు వారు...  ప్రతి కుటుంబాన్నికి వారే జగనన్న ఇచ్చిన నిజమైన వారసులు...అవ్వ తాతల నవ్వుల్లో విరభూసిన వెలుగులు వారు..  ఒకటవ తేదీన లబ్ధిదారులకు డబ్బులు  ఇచ్చి జీతం తీసుకొనే ప్రభుత్వ సర్వెంట్లు వారు... ప్రజలకు ,ప్రభుత్వాన్నికి మద్య పనిచేసే  వారధులు ...యాబై ఇళ్లల్లో ఒక్కొక్కరు ఒకొక్క చైతన్య దీపికాలు వారు....నవ సమాజ నిర్మాణoలో అలుపెరగని శ్రామికులు... వారే.. వారే.. సర్కార్ లో కొలువు చేస్తున్న  మన వాలెంటేర్లు..ఆ వాలేంటేర్లు బ్రతుకు చిత్రం చూస్తే అయ్యో అనిపిస్తుoది..ప్రతి ఇళ్లల్లో అన్ని ఉన్నాయా అని అడిగి మరీ వారి పనులు చేసిపెడ్తారు.. కానీ వారికి మాత్రo ఏమి లేకపోయిన సర్దుకుని కొలువు చేస్తారు.. ఏ ఇంటికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం మోసుకొని అధికారులకు చేరవేస్తారు.. వారికి కష్టం వస్తే మాత్రం కడుపులో దాసుకొంటారు.. ఎండనక, వాననాక తిరుగుతూ సమాజ సేవ చేస్తారు.. కరోనా లో సైతం ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ చేస్తున్నారు.. ఎక్కడి సమాచారం అక్కడ చేరవేసి కరోనా కట్టడిలో రాజీ లేని పోరాటం చేస్తున్నారు. జబ్బు చేసిన ఒక్కపూట  కూడా సెలవు పెట్టకుండా విధి నిర్వహణ చేస్తారు.. ఇంతచేసిన జీతం మాత్రం అరా కోరే..కడుపునిండా తినడానికి  ఆ జీతం సరిపోక  నానా అగచాట్లు పడుతున్నారు. రోజoతా కష్టపడిన  కొలువు గ్యారంటీ లేదని వలంటేర్లు వాపోతున్నారు.. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి నిరంతరం కష్టపడుతున్న వాలంటేర్లు శ్రమను గుర్తించి వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు