విశాఖ విషవాయువు ఘటనకు బాధ్యులైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై 302 కేసుపెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.
విషవాయువు ఘటనపై ఈ రోజు విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు.
కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం దుర్మార్గం.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి, సిపియం జిల్లా కార్యదర్శి బి. గంగారావు, సిపిఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు తదితరులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం.
తక్షణమే వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి.
ఇటువంటి ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలి.
- రామకృష్ణ.