ఉభయదేవేరులతో కొనకు చేరిన నృసింహస్వామి
నెల్లూరు జిల్లా:
రాపూరు మండలం ప్రసిద్ధి పుణ్యక్షేత్ర మైన పెంచలకొన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్తారింటి నుంచి కొత్త అల్లుడు ఉభయనాంచారులతో కలిసి పెంచలకొన చేరడంతో పెనుశీల నరసింహుని బ్రహ్మోత్సవాలు అంరంగా వైభవంగా మొదలయ్యాయి.
*పెళ్లి కొడుకైన పెంచల స్వామి*
హిరణ్యకశివుని వధంతం ఉగ్రరూపుడైన స్వామివారు నరసింహ అవతారంలో వెలుగొండల్లో సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి చెలిమిటో శాంతించారు.ఆమెను పెళ్లి చేసుక్కునట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతి ఏడాది గోనుపల్లిలో పెంచలనరసింహస్వామి పెళ్ళికొడుకై ఉదయం గిరిజన కాలనీకి వచ్చారు.గోనుపల్లి గిరిజనకాలనీలో పెళ్లి సందడి నెలకొంది. గోనుపల్లిలోని పెంచలస్వామి ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులను దేవాదాయ శాఖ సిబ్బంది గిరిజన కాలనీకి తీసుకువచ్చారు.ఈ మార్గంలో శ్రీవారు పెంచలకొనకు బయల్దేరాల్సి ఉండటంతో దేవ దేవేరులకు తమ చెంతకు రాగానే గిరిజనకాలనీ వాసులు ఆతిథ్యం ఇచ్చి పూజలు నిర్వహించారు. గోనుపల్లి నుంచి పెంచలకొన వరకు ఎద్దలబండి పై కొలువు దీర్చి తీసుకువచ్చారు,దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ జోల్లు వెంకటసుబ్బయ్య, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది, పోలీసులు, భక్తులు ఎద్దలబండితో వచ్చారు.
*గొల్లబోయికి తొలిదర్శనం*
పెనుశీల లక్ష్మీనరసింహస్వామి గ్రామానికి వచ్చిన తొలిసారి గొర్రెలకాపరికి తొలి దర్శనం ఇవ్వడంతో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోనుపల్లి సమీపంలోని గోల్లబోయిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారు అప్పట్లో గ్రామానికి చేరుకున్నప్పుడు తమ మహిమలు గురించి గ్రామస్తులకు వివరించి తమకు ఆలయం నిర్మించమని చెప్పి వెనుతిరిగి చూడకుండా వెళ్లమని గోల్లబోయిని ఆదేశించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే గొల్లబోయి వెనుతిరిగి చడడంతో శ్రీవారే గొల్లబోయి శిలారూపం దార్చలని పురాణాలు తెలిపాయి.ఏటా శ్రీవారు సతీసమేతంగా గొల్లబోయికి తొలి దర్శనమిచ్చిన అనంతరం కొనకు చేరుకుంటారు.
*గిరిజనులు సారె*
గోనుపల్లి గిరిజనకాలనీ కొత్త అల్లుడు రాకతో గిరిజనవాడాలో సంబరాలు అంబరాన్నంటాయి.ఇంటికి వచ్చి అల్లుడికి గిరిజనులు ఆచారం ప్రకారం పుట్టతేనె,ఇంజెటిగడ్డలు,నారె మొలతాడు సారెగా ఇచ్చారు. గిరిజన వాడాలో ప్రతి ఇంటి వద్ద ప్రత్యేక పందిళ్లు వేసి మధూవరులకు ఘన స్వాగతం పలికారు. అత్తారింటికి చేరుకున్న స్వామి అమ్మవార్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు గోనుపల్లి గిరిజనవాడకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. పల్లకిలో విశేష అలంకారణలో ఆశీనులైన స్వామి,అమ్మవార్లను చూసిన భక్తులు గోవింద నామ స్మరణలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
*కొనకు చేరిన శ్రీ వారు*
గోనుపల్లి గిరిజనవాడ నుంచి ఉభయనాంచారులతో బయలుదేరిన శ్రీవారు ఎద్దలబండి పై కొనకు చేరుకున్నారు. గోవిందనమస్మరణ చేసుకుంటూ.పెంచలకొనకు చేరుకున్నారు