గూడూరు మే 2 (అంతిమ తీర్పు) : లాక్ డౌన్ వల్ల పనులు లేక ఆకలితో అలమటించే నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో గూడూరు రెండవ పట్టణ పరిధిలోని శ్రీ వివేకానంద స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు 400 మందికి మధ్యాహ్న భోజనం తయారు చేసి గూడూరు 28 వ వార్డు లో గల నిరుపేదలకు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్కూల్ యాజమాన్యం చంద్ర మోహన్ మరియు వంశీ కృష్ణ నిర్వహించారు
శ్రీ వివేకానంద స్కూల్ ఆధ్వర్యంలో 400 మందికి మధ్యాహ్న భోజనం పంపిణీ