మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే ఇచ్చే పరిహారం రూ.5 లక్షలు సరిపోవని రూ.10 లక్షలు ఇస్తున్నాం: ముఖ్యమంత్రి వైఎస్

*06–05–2020*
*అమరావతి*


*అమరావతి:: మే 6 (అంతిమ తీర్పు) : క్యాంపు కార్యాలయంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం  వైయస్‌.జగన్‌, మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని హాజరు.పాల్గొన్న పలువురు మత్స్యకారసంఘాల ప్రతినిధులు.
*వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు.*


*దాదాపు 6 నెలల ముందుగానే!*


కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే.. మనకున్న కష్టాలకన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నాం: సీఎం
చేపల వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4 వేలు ఇచ్చేవారు:
అది కూడా అందరికీ ఇచ్చేవారు కాదు:
ప్రతి మత్స్యకారుడిలో వెలుగులు కనిపించని పరిస్థితి:
నా మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను:
వారి బతుకులు మారాలని తలచి.. ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం:


*నాడు ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పటికీ..:*


గత ఏడాది మే 30న అధికారంలోకి వచ్చాం:
అప్పటికే చేపల వేట నిషేధ సమయం దాదాపు ముగియడంతో ఆర్థిక సహాయం చేయకపోయినా పర్వాలేదన్న సలహాలు వచ్చాయి:
అయినా సరే గత ఏడాది నవంబరులో మత్స్యకార దినోత్సవం రోజున ‘మత్స్యకార భరోసా’కు శ్రీకారం చుట్టాం:
ముమ్మడివరంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. 


*ఆ డబ్బు ఇప్పటికీ రాలేదు:*


అప్పట్లో నేను అదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మత్స్యకారులు తమ బాధలు చెప్పుకున్నారు. గతంలో జీఎస్‌పీసీ డ్రిల్లింగ్‌ వల్ల 13 నెలలు ఉపాధి లేక నష్టపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదని వాళ్లు చెప్పినప్పుడు.. వారికిచ్చిన మాట ప్రకారం గత నవంబరులో రూ.70.53 కోట్లు వారికి పరిహారం చెల్లించాం:
ఇప్పటికీ ఆ డబ్బు ఇంకా రాలేదు :
ఆ డబ్బు కోసం ఎదురు చూడకూండా ఈలోగా మనం చేయాల్సిన మేలు చేశాం:
మత్స్యకారులకు మంచి జరగాలన్న ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం:


*ఇంకా ఏమేం చేశాం?:*
పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశించారని, మన వాళ్లను అరెస్టు చేశారు:
ఈ విషయాన్ని పాదయాత్రలో నాకు చెప్పారు:
మనం అధికారంలోకి వచ్చాక మన ఎంపీలతో ఒత్తిడి తీసుకువచ్చి వారిని విడుదల చేయించాం:
ఇంకా వారు జీవనం కొనసాగించడానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాం:
ఇలా ప్రతి విషయంలో కూడా మత్స్యకారులకు మంచి చేయడానికి ప్రయత్నాలు చేశాం:
మొన్న కరోనా కారణంగా గుజరాత్‌లో 4500 మందికి పైగా మత్స్యకారులు చిక్కుకుపోతే, వారి ఇబ్బందులు తెలిసిన వెంటనే.. వారికి తోడుగా ఉండడానికి గుజరాత్‌ సీఎంతో పాటు, కేంద్ర మంత్రులతో మాట్లాడి, రూ.3 కోట్ల మేర ఖర్చు చేసి.. వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చాం:
వారందరికీ పరీక్షలు చేసి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశాం. 
వారికి మేలు చేయడానికి ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టాం:


*ఇప్పుడు ఎన్ని కుటుంబాలకు?:*


ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటపై ఉండే నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ ఇచ్చే వారు కాదు:
ఇచ్చినా కూడా అరకొరగా ఇచ్చే వారు. అందరికీ ఇచ్చే వారు కాదు:
కరోనా కష్టాలు ఉన్నా కూడా.. మే 6న ఇవాళ 1,09,231 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం:


*ఇంకా ఏమేం ప్రయోజనాలు..:*


ఇదే కాదు.. డీజిల్‌ సబ్సిడీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదని పాదయాత్రలో చెప్పారు:
దీంతో డీజిలు సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కు పెంచాం:
అంతే కాకుండా డీజిల్ పట్టుకున్నప్పుడే సబ్సిడీ వచ్చేలా చేశాం:
మెకనైజ్డ్‌ బోట్‌కు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్‌ బోటుకు నెలకు 300 లీటర్లు ఇస్తున్నాం:
మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే ఇచ్చే పరిహారం రూ.5 లక్షలు సరిపోవని రూ.10 లక్షలు ఇస్తున్నాం:
దేవుడు దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం:


*శాశ్వత చర్యలు:*


మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని.. గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని, శాశ్వత పరిష్కారంగా..బాధ్యతలు చేపట్టిననాటి నుంచి మంత్రి మోపిదేవి ఎంతో కృషి చేసి.. వీటికి అనుమతులు తీసుకొచ్చారు:


8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు కట్టబోతున్నాం:
శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్లు.


*1 ఫిష్‌ ల్యాడింగ్‌ కేంద్రం:*


శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని కట్టబోతున్నాం:


*ఎంత వ్యయం?:*
వీటన్నింటికీ దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు కానుంది. 
3 సంవత్సరాల్లో ఈ తొమ్మిదింటి నిర్మాణం చేస్తాం :
వాటిని పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తాం
శాశ్వతంగా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  చేస్తున్న కార్యక్రమాలు:
గుజరాత్‌కు వలస పోవడమన్నది దశాబ్దాల కాలంగా జరుగుతోంది:
గత ప్రభుత్వంలో మూడే మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల కోసం కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు:
 అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.


ఆ తర్వాత వివిధ జిల్లాల నుంచి మత్స్యకారులు స్పందించారు.


*కె.శిరీష. శ్రీకాకుళం జిల్లా:*
– ‘మా ఆయన అనుకోకుండా పాకిస్తాన్‌ సైనికుల చేతిలో చిక్కి జైలులో మగ్గిపోతే, మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుని జైలు నుంచి విడిపించారు. అంతే కాకుండా రూ.5 లక్షలు ఇచ్చారు. దీంతో మేము బోటు కొనుక్కుని ఇక్కడే బ్రతుకుతున్నాం. అనేక సంక్షేమ పథకాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో రేషన్‌ ఇచ్చారు. డబ్బులు కూడా ఇచ్చారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా బోట్లకు బీమా సౌకర్యం కల్పించమని వేడుకుంటున్నాము’.



*మైలపల్లి పోలీసు. శ్రీకాకుళం జిల్లా:*
– ‘గత ప్రభుత్వ హయాంలో చేపల వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఇచ్చేవారు. అది ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు. పార్టీ వారికి మాత్రమే ఇచ్చేవారు. ప్రజాసంకల్పయాత్రలో మా బాధలను మీకు చెప్పాం. దేవుడి దయతో మీరు అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.10 వేలు ఇస్తున్నారు. అనుకున్న సమయానికి ఈ డబ్బు ఇస్తున్నారు. మీకు రుణపడి ఉన్నాం. అలాగే ప్రతి మత్స్యకారుడికి పెన్షన్‌ కింద రూ.2250 ఇస్తున్నారు. మాకు డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు’.
 ‘కరోనా వైరస్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన సుమారు 4500 మంది అనేక రకాలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని మీకు తెలియజేయగానే మీరు వారిని రప్పించారు. మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలు’.


*బలగం వీరరాఘవయ్య. కృష్ణా జిల్లా:*
– ‘మాకు గతంలో ఎప్పుడూ సరైన సమయానికి సహాయం అందలేదు. కానీ మీరు వచ్చాక కచ్చితంగా చెప్పి మరీ ఇస్తున్నారు. పార్టీ అని చూడకుండా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. ఇవాళే మీరు రూ.10 వేలు ఇస్తున్నారంటే మాలో చాలా మంది నమ్మడం లేదు. గత ఏడాది కూడా మీరు చెప్పిన తేదీకి సహాయం అందించారు’.
 ‘నేను 1977 నాటి తుపాను కూడా చూశాను. అప్పటి నుంచి నేను చేపలవేటపైనే ఆధారపడ్డాను. కానీ ఏనాడూ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోలేదు. డీజిల్‌ సబ్సిడీ బిల్లులు దాచుకుని, ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ మీరు ఆ సబ్సిడీ వెంటనే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మా వంటి పేదల కోసం అమ్మ ఒడి పథకం. రూ.15 వేలు ఇచ్చారు. నాకు తెలిసిన అందరికి డబ్బులు వచ్చాయి. డీజిల్‌ సబ్సిడీ రూ.9 వెంటనే అందుతోంది. అందుకు ఎంతో సంతోషం’.
 ‘మాలో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఎమ్మెల్యే వరకే పరిమితం అయ్యారు. కానీ మీరు మాలో ఒకరైన మంత్రి మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపిస్తున్నారు. అందుకు రుణపడి ఉంటాం. అదే విధంగా ఇంగ్లిష్‌ మీడియమ్‌ను కచ్చితంగా అమలు చేయండి. మా పిల్లలను ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివించండి’.


*జెల్ల లక్ష్మి, ప్రమాదంలో భర్త చనిపోయిన మహిళ. కృష్ణా జిల్లా:*


– ‘ మీ రుణం తీర్చుకోలేను. నా భర్తను కోల్పోయి బాధల్లో  ఉన్న మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మా ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు నాకు అండగా నిలబడ్డారు. జగనన్న చేసిన మేలును ఎప్పుడూ మరిచిపోలేను. కష్టం వచ్చిందని తెలియగానే ఇంత త్వరగా స్పందించి మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఆమె కన్నీరు పెట్టుకోగా, స్పందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ‘ధైర్యంగా ఉండమ్మా..’ అంటూ ఆమెకు భరోసా ఇచ్చారు.


*పోతురాజు, గచ్చికాయలపురం, తూ.గో. జిల్లా:*
– ‘మీ పాదయాత్రలో మా సమస్యలను నివేదించాం. గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ నుంచి పరిహారం ఇప్పించాలని కోరాం. 63 గ్రామాల ప్రజలు 103 రోజులు పోరాటం చేశారు. 13 నెలలకు పరిహారం ఇస్తామని వారు చెప్పారు. కానీ 6 నెలలకు మాత్రమే ఇచ్చి.. మిగతా డబ్బు ఇవ్వలేదు. గ్రాఫిక్స్‌ సీఎం వచ్చి ఆ విషయాన్ని మరిచిపోయారు. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు. మీరు వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎంతో మంది సీఎంలు వచ్చారు, వెళ్లారు. మత్స్యకారులకు మీరు చేసినట్టుగా మరెవ్వరూ సేవ చేయలేదు’.


*గరికిన యోహాను, సూర్యారావుపేట, కాకినాడ:*
– ‘గత ప్రభుత్వ హయంలో డబ్బు సరిగా వచ్చేది కాదు. మీరు ఇస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా మా పిల్లలను చదివించుకునేందుకు మీరు సహాయపడుతున్నారు. నా ఇద్దరు బిడ్డలూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా బాగుండడంతో వారు సంతోషంగా బడికి వెళ్తున్నారు. అలాగే మత్స్యకారుల బిడ్డలకు వాలంటీర్‌ పోస్టులు కూడా ఇచ్చారు. మాకు చాలా సేవ చేస్తున్నారు. వృద్ధులకు చాలా ఉపయోగం. పది కాలాలు మీరు చల్లగా ఉండాలి. కరోనా సమయంలో కూడా మీరు ఉచితంగా రేషన్‌ ఇచ్చారు, డబ్బు చేతిలో పెట్టారు. చాలా సంతోషంగా ఉన్నాం’. 


*బర్రి పోలయ్య,మత్స్యకారుడు, విజయనగరం జిల్లా:*
– ‘జెట్టీలు, హార్బర్లు లేకపోవడం వల్లే మేం వలసపోతున్నామనే విషయాన్ని మీకు పాదయాత్రలో నివేదించాం.
 ఆ మాటలన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తామని చెప్పడం సంతోషకరం. పాకిస్థాన్‌ జైలు నుంచి తిరిగి వస్తామని మా మత్స్యకారులు అనుకోలేదు. కాని మీరు తీసుకు
వచ్చారు. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాం’.


*ధనరాజ్, నెల్లూరు జిల్లా:*


– ‘గతంలో భరోసా పేరుతో 25 కేజీల బియ్యం, రూ.2 వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ మొత్తం రూ.4 వేలు చేసినా, అందరికీ ఇచ్చే వారు కాదు. ఊళ్లో కొందరికే వచ్చేది. వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బు అరకొరగా కొందరికే ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా మంచి చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. వైయస్సార్‌ గారు దూరం అయ్యాక మాకు వచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారుడ్ని మరిచిపోయింది. ఇప్పుడు అందరికీ సంతృప్తికర స్థాయిలో అన్నీ వస్తున్నాయి. గంగమ్మతల్లి తర్వాత మీరే మాకు దేవుడిలా నిల్చారు’.


*నర్సింగ్‌రావు, బోటు యజమాని. విశాఖపట్నం*


– ‘గతంలో మాకు కొంత మాత్రమే సబ్సిడీ వచ్చేది. మీరు వచ్చాక ఆ మొత్తం పెంచారు. డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచి వెంటనే ఇచ్చేస్తున్నారు. పాదయాత్రలో హామీ ఇచ్చారు. నేను విన్నాను. నేను విన్నాను. అన్నారు. అందువల్ల మీరు ఉన్నారన్న భరోసా, నమ్మకం ఎంతో ఉంది. మాలో ఒకరిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇది మా అందరికీ గౌరవం. మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మీలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. మత్స్యకారుల కుటుంబానికి పెద్దకుమారుడు మీరు’. 


 ఆ తర్వాత విజయనగరం నుంచి మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా పూసపాటిరేగమండలం చింతపల్లి లేదా కోనాడలో ఫిషింగ్‌ జెట్టీ నిర్మించాలని కోరడంతో సీఎం అంగీకరించారు.


 చివరగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ‘ అధికారంలోకి వచ్చాక రెండోసారి ఈ కార్యక్రమం, కేవలం ఏడు నెలల వ్యవధిలోనే చేస్తున్నామని,  దేవుడి దయతో ఇంకా ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
 ఆ తర్వాత సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ బటన్‌ నొక్కి మత్స్యకారభరోసాను ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,09,231 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ అయ్యాయి.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image