గుంటూరు.,మే 8 (అంతిమ తీర్పు):
ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షల రూపాయల చెక్కును పంచాయతీరాజ్ గ్రామీణభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అందించిన శర్వాని రెడిమిక్స్ ఇండస్ట్రీస్ అధినేత పెద్ది రెడ్డి గోపాల్ రెడ్డి.
మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 8వ తేదీన విజయవాడలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కలసి ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయల చెక్కును శర్వాని రెడిమిక్స్ అధినేతలు పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి, పెద్దిరెడ్డి దీపలు అందించారు. ఈ కార్యక్రమంలో పోలూరి వీరా రెడ్డి, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.