జర్నలిస్టులకు 50 లక్షల బీమా వర్తింపచేయాలి -- ఏపిజేయఫ్ నెల్లూరు జిల్లా కమిటీ
నెల్లూరు:మే 12 :ముఖ్యమంత్రి జగన్ మెాహన్ రెడ్డి గారికి జర్నలిస్టు సమస్యలను పరిష్కరించగలరని కోరుతూ ఏపిజేయఫ్ రాష్ట్ర విజ్ఞప్తి లేఖను రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి ఆనీల్ కుమార్ యాదవ్ గారి ద్వారా ముఖ్యమంత్రివర్యులకు అందజేయగలరని వినతిని ఇవ్వటం జరిగింది .ప్రతి జర్నలిస్టుకు కరోనా పరీక్షలు నిర్వహించాలని,జర్నలిస్టులకు రూ 50 లక్షల బీమా వర్తింపజేయాలని,క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు యన్ - 95 మాస్క్ లను,శానిటైజర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించాలని,జర్నలిస్టుల కుటుంబాలకు లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు,కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని,నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు కేటాయించాలని,జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పట్టణ గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపిజేయఫ్) విజ్ఞప్తి చేసింది.కరోనా వైరస్ నియంత్రణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఏపిజేయఫ్ తెలియజేసింది.కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న డాక్టర్లు,వైద్య సిబ్బంది,పోలీసులు,రెవెన్యూ,పారిశుద్ధ్య కార్మికులు జర్నలిస్టులకు ఏపీ జే ఎఫ్ అభినందనలు తెలిపింది.
నెల్లూరు జిల్లాలోని జర్నలిస్ట్ లకు సి.ఎస్. ఆర్ నిధులతో నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపిజేయఫ్) నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు),అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాసులు ,ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బుసింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్.దిలిప్, ఉపాధ్యక్షులు నన్నూరు శ్రీనివాసరావు, ఓ. వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రెటరీ జయ కుమార్ సింగ్ కమిటీ సభ్యులు శ్రీ హరి ప్రసాద్, వి.రమేష్ కుమార్, అంతిమ తీర్పు పత్రిక ఎడిటర్ వల్లూరు ప్రసాద్ కుమార్ , జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.