*02–05–2020*
*అమరావతి*
సీఎం వైయస్.జగన్‌తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్స్
*అమరావతి:*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల మధ్య వీడియో కాన్ఫరెన్స్*
*ఏపీ నుంచి ఒడిశా వలస కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన వారి తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు*
*అలాగే ఒడిశాలో ఉన్న ఏపీ వాళ్లనికూడా తరలించే విషయమై చర్చలు*
*ఏపీలో చిక్కుకుపోయిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు అందించి ఆదుకున్నందుకు సీఎం శ్రీ వైయస్.జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఒడిశా సీఎం.*
*ఒడిశా సీఎం శ్రీ నవీన్ పట్నాయక్.. ఏమన్నారంటే...:*
ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. అంతేకాక మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల ఎదురవుతున్న క్లిష్ట పరిస్ధితిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోంది. దన్యవాదాలు.
*ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మాట్లాడుతూ....:*
‘‘మీ అభ్యర్ధనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం నవీన్ జీ. దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో రిలీఫ్‌క్యాంప్‌లలో ఉన్నవారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన వారిని కూడా వారు పనిచేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్ళేందుకు సిద్దమైతే వారిని కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం నవీన్ జీ. మీలాంటి నాయకులు చాలా స్ఫూర్తిదాయకులు.
తర్వాత ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు.
కోవిడ్–19 నివారణలో బాగా పనిచేస్తున్నారంటూ సీఎంను ప్రశంసించారు.