కమీషన్లకు  కక్కుర్తిపడి , మద్యం రేట్లు పెంచి , ప్రజల ప్రాణాలతో  చెలగాటం ఆడుతున్నావు :ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ

ప్రెస్ నోట్ :


జగన్ రెడ్డి నువ్వు మనిషివా ...రాక్షసుడివా ??
ఇది పైశాచికత్వం :ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ


కమీషన్లకు  కక్కుర్తిపడి , మద్యం రేట్లు పెంచి , ప్రజల ప్రాణాలతో  చెలగాటం ఆడుతున్నావు !!


పేదవాడి కడుపు కొట్టి , నీ జేబు నింపుకునే ప్రయత్నం ...ఆడవాళ్ళ ఉసురు పోసుకోకు !!


రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ చెయ్యటం వల్ల ...ప్రజలు  భౌతిక దూరం పాటించకుండా , పోలీసులు కంట్రొల్ చెయ్యలేక కరోనా వైరస్ బారిన పడితే రాష్ట్ర ప్రభుత్వానిదే  నైతిక బాధ్యత - కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ 


అమరావతి రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇచ్చి ,  140 రోజులు గా అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తూ , కరోనా లాక్ డౌన్ వల్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మహిళలు , దళిత రైతుల పైన కేసులు పెట్టారు ...అదే అమరావతి రాజధాని ప్రాంతంలో మద్యం షాపుల ముందు ఉదయం నుండి మస్కులు ధరించకుండా , భౌతిక దూరాన్ని పాటించకుండా బారులు తీరిన ప్రజలు !
ఇది పుర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ...


పేదవాడి ఆకలి తీర్చటానికి , అన్నం పెట్టిన ప్రతిపక్షాల పైన కేసులు పెట్టారు ...
ఇది ఎక్కడి న్యాయం ?


ముఖ్యమంత్రి గారు శవాల మీద చిల్లర ఏరుకునే ప్రయత్నాలు మాని ...లాక్ డౌన్ ఎత్తివేసే వరకు మద్యం షాపులు తెరవ కూడదు అని డిమాండ్ !



- ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు