యేడాది కాలంలో ఎస్.ఐ బాజిరెడ్డి తీరు భేష్

యేడాది కాలంలో ఎస్.ఐ బాజిరెడ్డి తీరు భేష్..


వింజమూరు, మే 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఎస్.ఐ బాజిరెడ్డి గారికి అహ్వానం అందించారా...ముందు ఆయనను మన కార్యక్రమానికి అతిధిగా పిలవండి అనే మాట వింజమూరు మండల వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇదే ఆయన వింజమూరు మండల ప్రజల మనస్సులలో చూరగొన్న అభిమానం... వివరాలలోకి వెళితే గత యేడాది మే నెల 10 వ తేదీన వింజమూరు ఎస్.ఐ గా భాధ్యతలు నిర్వహించారు. అప్పటి నుండి తనదైన శైలిలో మండల రక్షణ వలయాధికారిగా న్యాయం విషయంలో పదిమందికీ మంచి చేస్తూ పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను తారాస్థాయికి చేర్చారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. సహజంగా ఆయన ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలవడంతో పాటు 'గారు ' అని సంభోదించడం గొప్ప విషయం. ఎస్.ఐ బాజిరెడ్డి వింజమూరులో భాధ్యతలు చేపట్టిన తరువాత కాలంలో అప్పటికే మిస్టరీగా మారి ఉన్న బర్రెల దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని కటకటాల పాలు చేశారు. తదుపరి అత్యంత భయంకరమైన తూర్పు గోదావరిజిల్లాలోని గోకవరానికి చెందిన బరితెగింపు నేరస్థుల ఆటను సాహసోపేతంగా రక్తి కట్టించారు. అంతేగాక వింజమూరు బి.సి కాలనీకి చెందిన బాలుడి కిడ్నాప్ కేసును త్వరితగతిన చేధించి వారి తల్లిదండ్రులకు న్యాయం చేయడంతొ పాటు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తే చట్టం ఊరుకోదని హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్నేళ్ళ నుండి వ్యవసాయ పొలాలలో రైతులకు చెందిన మోటార్లను యధేచ్చగా దొంగిలిస్తూ తమ కార్యకలాపాలను సాగిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకుని తమ జీవితంలో ఇక ఎన్నడూ తప్పులు చేయబోమని వారి చేత ప్రతిజ్ఞలు చేయించి మార్పు తేవడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి రైతులకు కీడు చేస్తున్న వారి ఆటలకు చరమగీతం పాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి సెల్ ఫోన్ లలో మహిళలను వేధిస్తున్న ఆకతాయికి సరైన గుణపాఠం నేర్పారు.  ప్రతినిత్యం తన విధి నిర్వహణలో భాగంగా మీ రక్షణ కోసం మేమున్నాం...సమాజంలో శాంతిభధ్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖకు సహకరించండి అంటూ ఎస్.ఐ బాజిరెడ్డి చేస్తున్న విన్నపాలును ప్రజలందరూ పాటిస్తున్నారనే సంకేతాలను వింజమూరు మండలంలో బలంగా ప్రజలలో నాటుకుపోయే విధంగా కృషి చేశారని చెప్పవచ్చు. తాజాగా ఇటీవల మండలంలోని చౌటపల్లి గ్రామంలో దారుణహత్యకు గురైన మేడిపల్లి.వెంగళరావు హత్యను ఫిర్యాదు అందిన 24 గంటల లోపే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని వెంగళరావు మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు నిందితుల ఆచూకీని స్వల్ప వ్యవధిలోనే కనిపెట్టిన ఘనతను ఎస్.ఐ బాజిరెడ్డి చాటుకున్నారు. అంతేగాక ప్రస్తుత కరోనా కాలంలో ఆయన కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా తన సిబ్బందితో ప్రజల శ్రేయస్సు కోసం రాత్రింబవళ్ళు రోడ్లుపై పడిగాపులు కాసి వింజమూరు మండల ప్రజల మనసులలో సుస్థిర స్థానమును సంపాదించుకున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు