ప్రజలకు కరోన దెబ్బ కంటే, వైసిపి  కరెంటు బిల్ షాక్ ప్రజలకు ఎక్కువగా తగిలింది : జనసేన  రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ 

ప్రజలకు కరోన దెబ్బ కంటే, వైసిపి  కరెంటు బిల్ షాక్ ప్రజలకు ఎక్కువగా తగిలింది


కరోనా కైనా ప్రజల పై కనికరం ఉంది గాని, జగన్ గారి ప్రభుత్వానికి మాత్రం కనికరం లేదు


విద్యుత్ బిల్లుల పెంపును రద్దు చేయాలి,మార్చ్ నెల బిల్లునే ఏప్రిల్ నెలకు వర్తింపజేయాలి


మూడు నెలల ఉచిత రేషన్ ఇచ్చామని, దానికి రెండింతల బారాన్ని పేద ప్రజలపై మోపారు


        విజయవాడ మే 16 (అంతిమ తీర్పు) : బెంజ్ సర్కిల్ వద్ద గల జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ కరోనా షాక్ కన్నా కరెంటు బిల్లులు షాక్ రాష్ట్ర ప్రజలను ఎక్కువ ఇబ్బంది పెడుతుందనిరాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కూడా కరెంటు బిల్లుల భారం కుదిపేస్తుందని రెండు నెలల బిల్లులు సరాసరి చేసి స్లాబ్ మార్చడం వలన  బిల్లులు నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చాయని ఇది పూర్తిగా ప్రభుత్వ కుట్రేనని ఒక్క యూనిట్ తేడా వస్తే -కేటగిరి వారు బి -కేటగిరీ లోనికిబి-కేటగిరీ వారు సి-క్యాటగిరి లోనికి మారతారని తద్వారా బిల్లు తడిసి మోపెడు అవుతాయనిఒక ప్రాంతంలో తేడా రావచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ బిల్లులు ఎందుకు తేడా వస్తాయని స్లాబ్స్ మారడం వలన 400 నుంచి 500 శాతం అధికంగా బిల్లులు వచ్చాయని  కరోనా లాక్ డౌన్ వలన వాణిజ్య సముదాయాలు విద్యుత్ వినియోగించక పోవడం వలన ప్రభుత్వాలకు నష్టం వాటిల్లిందని నష్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదసామాన్యమధ్యతరగతి ప్రజలపై  భారాన్ని మోపి 2800 కోట్ల అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారుగత నెలలో ప్రభుత్వం మూడు విడతలుగా  రేషన్ ఇచ్చామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు నేడు కరెంట్ బిల్లు ద్వారా రేషన్ కు రెండింతలు వసూలు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు కరోనా షాక్ న్నా కరెంటు బిల్లులు షాక్ కి భయపడి ప్రభుత్వ క్వారంటైన్ కు వెళ్తే  బాధలు ఉండవనే స్థాయికి వచ్చారంటే జగన్ గారి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచన్నారు.ఎన్నికల్లో అక్క,చెల్లెల బుగ్గలు నిమురుతూ ఓట్లు వేయించుకొని ప్రతి అక్కచెల్లెమ్మకు మద్యం ద్వారా ఒక చెంప నువిద్యుత్ బిల్లు ద్వారా మరొక  చెంప  చెల్లుమనిపించిన ఘనత  జగన్ గారికే దక్కుతుందన్నారు. ప్రభుత్వానికి నిజంగా పేద,సామాన్య వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే  మార్చి నెల యావరేజ్ బిల్లునుఏప్రిల్ లో ప్రజలు చెల్లించారని దాన్నే తుది బిల్లు గా పరిగణించాలని అదే విధంగా ఏప్రిల్ బిల్లు ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రజల తరపున పోరాడతామన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image