10.5.2020
వైసీపీ నేతల అబద్ధాలకు సిగ్గే సిగ్గు పడుతోంది
జగన్ మద్యపాన నిషేధం దిశగా అడుగులు ఎక్కడ వేస్తున్నారు? తాడేపల్లి ప్యాలెస్ లోనా, లోటస్ పాండ్ లోనా?
కళా వెంకట్రావు
రాష్ట్రంలో ఓ వైపు మద్యం ఏరులై పారుతుంటే...మరో వైపు వైసీపీ మాత్రం మద్యం నియంత్రణకు విప్లవాత్మక మార్పులు తెచ్చామని ప్రకటన లు ఇవ్వటం సిగ్గుచేటు.
ఊరూరా బెల్టు షాపులు తెరవడం విప్లవాత్మక మార్పా? విప్లవాత్మక మార్పు అంటే ఏంటి ?మద్యం ధరలు పెంచి పేదల రక్తం తాగటమా? ప్రభుత్వ పెద్దలకు చెందిన డిస్టరీల మద్యం విక్రయించటమా? వలంటీర్ల చేత నాటు సారా తయారు చేయించి డోర్ డెలివరీ చేయించటమా? ఇదేనా విప్లవాత్మక మార్పు?
వైసీపీ అబద్ధాలకు సిగ్గే సిగ్గు పడుతుంది. పత్రికా ప్రకటన లో చెప్పినవన్నీ అబద్ధాలే. అంకెల గారడీ తో ప్రజలను మోసం చేస్తున్నారు. సూట్ కేసు కంపెనీల్లో దొంగ లెక్కలు రాసినట్లు పత్రిక ప్రకటనల్లో కూడా దొంగ లెక్కలు రాసి ప్రజల ని మోసం చేస్తారా?
రాష్ట్రంలో ఏ వైపు చూసినా మద్య ఏరులై పారుతోందని వైసీపీ నేతలు సహా స్పీకర్ తమ్మినేని బహిరంగంగా చెప్తున్నారు. ఇక మద్య పాన నిషేదం దిశగా జగన్ అడుగులు ఎక్కడ వేస్తున్నారో చెప్పాలి? ఆయన అడుగులు వేసేది తాడేపల్లి ప్యాలెస్ లోనా, లోటస్ పాండ్ లోనా?
మద్యం అక్రమ రవాణా చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తెచ్చామన్నారు, రాష్ట్రంలో వైసీపీ నేతలు, వాలంటర్లే అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. ఇంత వరకు ఎంతమందిని అరెస్టు చేసారు.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి, జే టాక్స్ కోసం నాణ్యత లేని బ్రాండ్లకు అనుమతిలిచ్చి ప్రజల ప్రాణాల తో చేలాగాట మాడుతున్నారు. మద్యం ధరలు పెంచి వారి రక్తం తాగుతున్నారు. మద్యానికి అలవాటు పడిన వారు ఇది వరుకు తాను రోజంతా కష్ట పడి సంపాదించిన డబ్బులో సగం మద్యనికి ఖర్చు చేసి మిగతా డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవారు, కానీ ఇప్పుడు మద్యం ధరలు పెంచడం తో మొత్తం తన తాగుడుకే ఖర్చు చేసి కుటుంబాల్ని పస్తులుంచుతున్నారు.ఖజానా నింపుకోవాలన్న ద్యాశ తప్ప మధ్యనియత్రణ అమలు చేయాలన్న ఉద్దేశ్యం ఏ కోశానా ప్రభుత్వానికి లేదు. గత ఏడాది ఎక్సైజ్ రాబడి రూ.6,220కోట్ల నుండి రూ.6,536కోట్లకు పెరిగింది. అంటే మద్యం ఆదాయం ద్వారా రూ.336కోట్లు పెరిగింది. ఇప్పుడు 75 శాతం ధరల పెంచి రూ.9000 కోట్ల భారం మోపారు.మీరు మధ్య పాన నిషేధం చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? వైసీపీ నేతలు ఇప్పటికైనా అబద్దాలు చెప్పటం మానుకోవాలి.నూతన ఇసుక పాలసీ పేరుతో ఉచిత ఇసుకను రద్దు చేసి, ఇసుకను నిలిపేసి అనేక మంది కార్మికుల ప్రాణాలు తీశారు. కానీ నూతన మద్యం పాలసీ తెచ్చేటపుడు మద్యం అమ్మకాలు ఎందుకు ఆపలేదు
లాక్ డౌన్ మూలంగా 44 రోజులుగా మధ్యం దొరకక పోవడంతో మధ్యం అలవాటున్న వారు కూడా బలవంతంగా మానుకొన్నారు. లాక్ డౌన్ సడలించి మధ్యం దుకాణాలు తెరచి మళ్ళి మద్యానికి బానిసల్ని చేసారు.మీరు మధ్య పాన నిషేధం చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? వైసీపీ నేతలు ప్రజల ను ఇంకెంత కాలం మోసం చేస్తారు.
S/d
కళా వెంకట్రావు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు