కరోనా పాజిటివ్ వ్యక్తి ఇంటికి హైపో క్లోరైట్ స్ప్రే చేసిన : ఎమ్మెల్యే చెవిరెడ్డి..

కరోనా పాజిటివ్ వ్యక్తి ఇంటికి హైపో క్లోరైట్ స్ప్రే చేసిన : ఎమ్మెల్యే చెవిరెడ్డి..
* అధికార యంత్రాంగంతో అప్రమత్తం చర్యలు
* అదైర్య పడొద్దని ప్రభుత్వ సిబ్బందికి భరోసా
* స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు సూచన


తిరుపతి, 


కరోనా పాజిటివ్ కేసు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ కాలనీలో నమోదైందని తెలుసుకొన్న ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంటనే స్పందించారు. అధికార యంత్రాంగంతో కలిసి శుక్రవారం హుటాహుటిన కరోనా వచ్చిన వ్యక్తి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంటికి చెవిరెడ్డి గారు స్వయంగా హైపో క్లోరైట్ పిచికారీ ని స్ప్రే చేశారు. అనంతరం పరిసర ప్రాంతాలలో పిచికారీ స్ప్రే చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ కేసు నమోదుతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల చర్యలు చేపడుతోందని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై మెరుగైన సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. బాధ్యత కలిగిన శాసన సభ్యుడిగా నేను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానని స్పష్టం చేశారు.  కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఐశులేషన్ లో చికిత్స పొంది సాధారణ వ్యక్తులుగా తిరిగి వస్తున్న సందర్భాలను గుర్తు చేస్తూ ప్రజల్లో దైర్యం నింపారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం అధైర్య పడకుండా అవకాశంగా భావించాలని సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట తిరుపతి రూరల్ ఎంపీడీవో సుశీల దేవి, తహశీల్దార్ కిరణ్ కుమార్, వైద్య సిబ్బంది, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు