నిజాలను నిర్భయంగా రాసే 'పత్రికా స్వేచ్ఛ' అవశ్యం : మంత్రి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 03-05-2020,
అమరావతి.


పత్రికా స్వేచ్ఛ ప్రతి ఒక్కరి స్వేచ్ఛ: మంత్రి గౌతమ్ రెడ్డి


* నిజాలను నిర్భయంగా రాసే 'పత్రికా స్వేచ్ఛ' అవశ్యం


అమరావతి, మే, 03;  నిత్య ప్రజా చైతన్యానికి, సమాజాన్ని సంఘటితం చేయడానికి పాటు పడే పత్రికలకు స్వేచ్ఛ అవశ్యమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి,  ప్రపంచానికి తెలియని వాస్తవాలు వెలికి తీసి ప్రజల ముందుంచడానికి, , విపత్కర పరిస్థితుల్లో జనాన్ని మేల్కొలపడానికి, అత్యవసర సమయాల్లో అందరినీ ఒకతాటిపై నిలిపేందుకు పత్రికా స్వేచ్ఛ అత్యంత అవసరమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను ప్రజలకు తెలుపుతున్న పత్రికలకు, విలేకరులకు మంత్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఎటువంటి సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం తపించే పత్రికా స్వేచ్ఛ ఎప్పుడూ వెలకట్టలేనిదని మంత్రి తెలిపారు. ముఖ్యంగా, కరోనా సమయంలో అవాస్తవాలతో భయాందోళన చెందే ప్రజలకు నిజాలను నిర్భయంగా పత్రికలే గుండె ధైర్యమని మంత్రి వెల్లడించారు. ఇతర మాధ్యమాలకు పత్రికలు ఆదర్శమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడి త్యాగాలు చేసిన కలం యోధులను స్మరించుకోవడానికి  యునెస్కో  తీర్మానం మేరకు 1993 నుంచి ప్రతి ఏటా మే 3న జరుపుకునే పత్రికా స్వేచ్ఛ   ప్రపంచంలోని ప్రతి ఒక్కరి స్వేచ్ఛ అని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.