*కార్యకర్తను పరామర్శించిన ' కావ్యా. క్రిష్ణారెడ్డి '*
జలదంకి, మే 7 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): తన అనుయాయుడిగా ఉన్న కార్యకర్త అనారోగ్యంతో భాధపడుతున్నాడని తెలుసుకున్న ఆ నేత ఆఘమేఘాల మీద ఆ కార్యకర్త ఇంటికి చేరుకుని నీకు నేనున్నానంటూ మనోధైర్యం నింపి కార్యకర్తలకు భరోసా ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. వివరాలలోకి వెళితే జలదంకి మాజీ మండలాధ్యక్షులు, కావ్యా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగుమాటి.వెంకటక్రిష్ణారెడ్డి గురువారం సాయంత్రం జలదంకి పంచాయితీ పరిధిలోని అరుందతీయవాడకు వెళ్ళి అనారోగ్యంతో భాధపడుతున్న మల్లెల.శ్యామేల్ అనే కార్యకర్తను పరామర్శించారు. భాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతూ అధైర్య పడాల్సిన అవసరం లేదని మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విలక్షణ శైలి కలిగిన కావ్యా. క్రిష్ణారెడ్డి ఒక్కసారిగా అరుందతీయవాడకు వచ్చి ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్ళి అతని వద్దనే కూర్చుని మాటామంతీ కలపడంతో కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాలలో బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ తన వెన్నంటి నిలిచిన కార్యకర్తలను ఎట్టి పరిస్థితులలోనూ వుస్మరించేది లేదని స్పష్టం చేశారు. ఈ సంధర్భంగా ఆయన వెంట నేతలు కూరపాటి.మాలకొండారెడ్డి, ఇస్కా.మదన్ మోహన్ రెడ్డి, సురె.శేషారెడ్డి, కోర్సిపాటి.రామిరెడ్డి తదితరులున్నారు.