,ఎమ్మిగనూరు,పెద్దకడబూరు,మే,1 (అంతిమతీర్పు):-పెద్దకడబూరు మండలంలోని ఉపాధి హామీ పథకం పనులు క్రింద 903 ఉపాధి గ్రూపులు పనిచేస్తున్నాయి. కర్నూలు dwama ఆఫీసునుండి 1000 సబ్బులను పెద్దకడబూరు మండలానికి ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేశారని తెలిపారు. వాటిని 15 గ్రామ పంచాయతీలకు గాను ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లకు పంపిణీ చేయడం జరిగినది.1.5.2020 వ సంవత్సరం వరకు పనికి వచ్చిన ఒక్కొక్క గ్రూప్ కు ఒక సోపు మాత్రమఉపాధి హామీ పనుల దగ్గర ఇచ్చి, ప్రతిరోజు కూలీలు పని పూర్తి చేయగానే వెంటనే కూలీలు చేతులను సుబ్రముగా కడుక్కోవలెను.ఉపాధి హామీ కూలీలు ఇంటి దగ్గర నుండి ఒక బాటిలునీళ్లను త్రాగటానికి తీసుకొని,మరియు ఇంకొక్క బాటిల్ నీళ్ళనుచేతులను శుభ్రంగా కడుక్కో వడానికి తెచ్చుకోవాలని ఏపీవో రామన్న సూచించారు.కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము 4 రకాల సబ్బులను ఉపాధి హామీ కూలీలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రామన్న, EC శ్రీనివాసులు,టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి కూలీలకు సబ్బులు పంపిణీ