దాతృత్వం చాటిన దాతలు ....

దాతృత్వం చాటిన దాతలు ....


        కావలి, మే 7,(అంతిమ తీర్పు);   సంయుక్త సేవ సంస్థ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి వలన ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సమయం నుండి పనులు లేక ఇళ్ల కే పరిమితమైన నిరుపేద కుటుంబాలకు ప్రతిరోజు దాతల సహకారంతో వారి కడుపు నింపుతున్నారు . అదేవిధంగా గురువారం నాడు దాత ద్రోణాదుల నరేష్ కుమార్ ,నాగరాజు , పద్మలత సహకారంతో నెల్లూరు జిల్లా కావలి స్థానిక కావేరి గుంట అరుంధతి వాడ చెంచు గాని పాలెం నందు నిరాశ్రయులైన పేదవారికి 210 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసి వారి ఆకలికేకల ను తీర్చి మనసున్న మహారాజు గా వారి గుండెల్లో నిలిచ్చారు. ఇలాంటి దాతలు ముందుకు వచ్చి కష్టకాలంలో పేదవారికి చేయూతనివ్వాలని సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకుడు సురేంద్ర కోరారు .