బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం

15–05–2020
అమరావతి


ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులు
బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం
ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలపై రూ16,203 కోట్లకు పైగా ఖర్చు
కొన్నింటిలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా మరి కొన్ని నిర్మాణం
వచ్చే ఏడాది మార్చిలోగా వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు (సబ్‌సెంటరు)్ల నిర్మాణం, పీహెచ్‌సీల్లో నాడు–నేడు, కొత్త వాటి నిర్మాణం పూర్తి
కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త వాటి నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబరుకు పూర్తి
సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు
కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాల నమూనాల పరిశీలన


అమరావతి: 
రాష్ట్రంలో ఆరోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. సబ్‌ సెంటర్ల నుంచి మెడికల్‌ కాలేజీల వరకూ నాడు –నేడు కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం కోసం ఏకంగా రూ.16,200 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించి అధికారులతో సమీక్ష చేశారు. డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు (సబ్‌ సెంటరు)్ల:
– ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక విలేజ్‌ క్లినిక్‌ ఉండాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా సబ్‌ సెంటర్ల రూపంలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగానే దాదాపు 10 వేల వైయస్సార్‌ క్లినిక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. వీటి కోసం దాదాపు రూ.2026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్‌ సెంటర్లలో నాడు–నేడు ద్వారా అవసరమైన సదుపాయాలను కల్పిస్తుంది. 


– సబ్‌ సెంటర్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 4 వేల స్థలాలను గుర్తించారు, మరో 6 వేల సబ్‌సెంటర్లకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. జూన్‌ 15లోగా స్థలాల గుర్తింపు కావాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. 
వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్‌ సెంటర్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. 


ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు:


– రాష్ట్రవ్యాప్తంగా 1,138 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 149 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ. 256.99  కోట్లు ఖర్చు చేయనున్నారు.
– మరో 989 పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనులకోసం రూ. 413.01 కోట్లు ఖర్చుచేయనున్నారు. మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు.


ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు:


– 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు నేడు కింద రూ.695 కోట్ల ఖర్చు చేయనున్నారు. 
– 169 కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 


కొత్త మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు:


– రాష్ట్రంలో పాత మెడికల్‌ కాలేజీలు 11 ఉన్నాయి. 
– వీటితోపాటు అటాచ్డ్‌ ఇనిస్ట్యూషన్స్‌ టు మెడికల్‌కాలేజీలు –6, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. 
– వీటన్నింటికోసం రూ.6100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
– ఇవికాక 15 కొత్త మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు....సూపర్‌ స్పెషాల్టీ, క్యాన్సర్, ఇన్సిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ కోసం మొత్తంగా రూ. 6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
– ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
– కొత్తగా నిర్మించదలచిన మెడికల్‌ కాలేజీల నిర్మాణ రీతులపై నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. 
– నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతలో రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
– మొత్తం ప్రజారోగ్య రంగంలో నాడు –నేడు, కొత్తవాటి నిర్మాణాలకోసం రూ.16,200 కోట్లకుపైనే ఖర్చు అవుతుందని అంచనా.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image