తేది.03.05.2020
విలేకర్ల సమావేశం వివరాలు
మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోను అవినీతి మయం
జగన్ రెడ్డి అవినీతికి బండికి సాయి రెడ్డి, రాజేంధ్రనాధ్ రెడ్డిలు రెండు చక్రాలు
బుద్ధా వెంకన్న
జగన్ చేతిగాని అసమర్ధత పాలన ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది. భవిష్యత్ లో కరోనా మరింత ఉదృతం కాబోతుందని ఆయనే చెబుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కరోనా జ్వరం లాంటిది, వస్తుంది, పోతుందని చిన్నపిల్లవాడిలా జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉంది. కరోనాతో సహజీవనం చేయాలని ఆయన వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. కరోనా మహామ్మారి ఎక్కువగా ఉందని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం కరోనా అంటే ఏమీ లేదని జగన్ చెప్పడం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు అనేక విపత్తు సమయంలో ఏపీని ఆదుకున్నారు. ఈ సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరం. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగితుంటే జగన్ మాత్రం సిల్లీగా ఉంటున్నారు. ప్రపంచ మేథావులు ఏం మాట్లాడుతున్నారు. అందుకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నారు. తెలంగాణలో కేసులు తగ్గుతుంటే ఏపీలో కేసులు పెరుగుతున్నాయి. ప్రజలకు కరోనా రావాలని జగన్ కోరుకుంటున్నారా? కరోనా పుట్టిన చైనాలోను తగ్గుముఖం పడితే ఏపీలో మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ను ఎందుకు ఆదర్శంగాతీసుకోవడం లేదు? ప్రాతి వ్యక్తికి 3 మాస్కులు ఇస్తామన్నారు. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు? డాక్టర్లకు మాస్కులు లేవని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేశారు. శానిటైజేషన్ లేదని చెప్పిన నగిరి మున్సిపల్ కమీషనర్ ను సస్పెండ్ చేశారు. 5 కోట్లకు 3 మాస్కులు కావాలంటే 15 కోట్ల మాస్కులు కావాలి. ఇప్పటి వరకు ఎవరికి, ఎక్కడ ఇచ్చారు. కరోనాను అడ్డం పెట్టుకొని మాస్కుల రూపంలో స్కాం చేద్దామని చూస్తున్నారు. మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోను అవినీతి మయం దేశంలో ముఖ్యమంత్రులందరూ లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానికి సూచనలిస్తే జగన్ మాత్రం లాక్ డౌన్ ను తొలగించాలని చెప్పడం సిగ్గుచేటు. తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నేతల మందు కంపెనీలను తెరిచి అమ్ముకొని ప్రజలను దోచుకునేందుకు మద్యం షాపులు తెరిచేందుకు సన్నాహాలు చేస్తారా? రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల మధ్య సరిహద్దులు ఏ మాత్రం ఉన్నాయి? కరోనాను అంటించేందుకు మద్యం షాపులు తెరుస్తున్నారా? ప్రజలకు రూ.5వేలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? మూడు మాస్కులకు అయ్యే డబ్బులు ప్రజలకు ఇస్తే వాళ్లే మాస్కులు కొనుక్కుంటారు కదా? విజయసాయిరెడ్డి వైసీపీ మందిని రోడ్ల వెంటా తిప్పుతూ ఆర్బాటంగా తిరుగుతున్నారు. కరోనా ఈ మాత్రం అదుపులో ఉందటానికి పోలీసులే కారణం. వారికి నా సెల్యూట్ చేస్తున్నాం. కాని అధికారపక్షం నాయకులు ఇష్టానుసారంగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయసాయిరెడ్డి లెక్కలేని తనంగా తిరుగుతున్నారు. పరిపాలన అవగాహన లోపంలో భాగంగా ఇవ్వన్ని జరుతున్నాయి. లాక్ డౌన్ తగ్గుముఖం పట్టాల్సింది ఎందుకు పెరుగుతున్నాయి. కరోనా తగ్గించలేకపోతే వైసీపీ నేతలనైనా కంట్రోల్ లో పెట్టాలి. వైసీపీ నేతల ఎలా భయట తిరుగుతున్నారు. ప్రజలు పాలనతో విసుగెత్తిపోయారు. ఆరోగ్య సర్వే జగన్ ఎక్కడ, ఎప్పుడు చేయించారు. ఇదంతా అవాస్తవం. ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? జగన్ ఇప్పటికైనా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సొంత జిల్లా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఇటలీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆయన దాని గురించి మాట్లాడరు. ఇష్టానుసారంగా మాట్లాడే అనీల్ కుమార్ యాదవ్ కు కూడా నెల్లూరు లో కరోనా కేసులు కంట్రోల్ చేయడం చేతగాక చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డి, బుగ్గన ఇద్దరూ జగన్ అవినీతి బండికి రెండు చక్రాలు. ఎప్పటికైనా రెండు టైర్లు పంచర్ అవ్వడం ఖాయం. వైన్ షాపులు ప్రభుత్వం తెరవటం విరమించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు పాలన చూశాం కాబట్టి జగన్ పాలన ఒక సారి చూద్దామని ప్రజలు భావించారు. పరిపాలన ఇచ్చారని ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజలు విప్లవం ద్వారా గద్దె దింపుతారు.
బుద్ధా వెంకన్న
శాసనమండలి సభ్యులు