ఏఎన్ఎం లకు రక్షణ కల్పించాలని వినతి,
ఆదోని,మే, 15 (అంతిమతీర్పు):-ఆదోని పట్టణంలో ని కర్ణం విధి నిర్వహణలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని సచివాలయ ఉద్యోగులైన ఏఎన్ఎంలు పురపాలకశాఖ కమిషనర్ సుబ్బారావుకు విన్నవించారు. ఇటీవల పట్టణానికి చెందిన వారు తమిళనాడు,మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఆదోని పట్టణానికి చేరుకున్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేసి కర్నూల్ తరలిస్తున్న క్రమంలో తమకు బెదిరింపులు వస్తున్నాయని వారు తెలిపారు. కొందరు నాయకులు పార్టీల పేర్లు చెప్పి తమను వేధిస్తున్నారని విధులు నిర్వహించేందుకు భయంగా ఉందని చెప్పారు.వారి వివరాల కోసం వార్డులకు వెళ్తేనే దాడి చేసేలా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. కమిషనర్ స్పందిస్తూ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెదిరింపులకు పాల్పడే వారి సమాచారం తెలిపితే పోలీసులకు తెలిపి కేసు నమోదు చేయిస్తామని వారు తెలిపారు.