సేవా దృక్పథంతో ప్రజల వద్దకే వెళ్లి సేవలు చేస్తున్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు .....
కావలి ,మే 11(అంతిమ తీర్పు- N. సాయి )
కావలి పట్టణం లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు పారిశుధ్య కార్మికులకు ఉదయం టిఫిన్ ప్యాకెట్లు పంపిణీ చేసి పోలీసు సిబ్బందికి మంచినీటి సదుపాయం కోసం 10 కూలింగ్ వాటర్ క్యాన్ లు ఏర్పాటు చేయడమే కాకుండా మధ్యాహ్నం 150 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని వ్యవస్థాపకుడు సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్క్రాస్ కార్యవర్గ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయు మాట్లాడుతూ రవి ప్రకాష్ మరియు రామకృష్ణ సంయుక్త సేవా సంస్థ ద్వారా కావలి పట్టణం నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు టిఫిన్ ప్యాకెట్లు,మంచినీరు పంపిణీ చేయడమే కాకుండా మధ్యాహ్నం 150 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు . సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభం నుంచి నేటికీ 50 రోజులుగా మా సేవలు కొనసాగిస్తూ సంస్థ కు సహకరించిన ప్రతి ఒక్క దాతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు గంధం ప్రసాద్ , నేలటూరి శివప్రసాద్ రెడ్డి ,గనీ భాష ,వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.