*ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి
వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ*
సాయం అందించడం మావంతు
ఇళ్ళు కదలకుండా ఉండడం మీ వంతు ............
ఓంకార్ సేవా సమితి అధ్యక్షుడు
గండే సాంబశివరావు పిలుపు.........
ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ..........
కరోనా ప్రభావంతో విలవిల్లాడుతున్న వలస కార్మికులను తెలుగు సంస్కృతిని సంప్రదాయాలు కాపాడే గంగిరెద్దుల ఆటగాళ్ల కుటుంబాలను ............
ఆదుకొని ఆహారం అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఓంకార్ సేవా సమితి అధ్యక్షుడు గండే సాంబశివరావు అన్నారు...........
అలాగే సాయం చేయడం తమవంతని ఇళ్ళు కదలకుండా ఉండడం మీ వంతని ఆయన అన్నారు...........
ఇంటి బయట తిరగొద్దని.... ఇంట్లొకి కరోనాని తేవద్దని హితవు పలికారు...............
కరోనా కోవిడ్ 19 మహమ్మరిని తరిమికొట్టాలని దానిగాను ప్రజలు ప్రభుత్వం, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలు బౌతిక దూరంతో కరోనాని దూరం చేయవచ్చు అని సాంబశివరావు పిలుపునిచ్చారు...............
సోమవారం ఉదయం అరుంబాక పంచాయతీ పరిధిలోని గంగిరెద్దుల ఆట వలస కుటుంబాల చిన్నారులకు, నెల్లమ్మ గుడి సమీపంలో కాలనీలోని చిన్నారులకు, గుళ్లపల్లి బూర్లమ్మ డొంకలో వలస కార్మికుల చిన్నారులకు ఉదయం అల్పాహారం , వందలాది మందికి ఇడ్లీ పొట్లాలు అందించారు .........
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, సేవ సమితి సభ్యులు తూనుగుంట్ల శ్రీనివాసరావు, కేసన సాంబశివరావు, సీతారామయ్య, కుమార్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు..........................
గత కొన్ని రోజులుగానిర్విరామంగా సాగుతున్న ఆహార పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని......
మంగళవారం ఇడ్లితో పాటు అరటిపండ్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సేవా సమితి అధ్యక్షుడు తెలిపారు.............