జిల్లాలో కరోనా కలకలం ఎమ్మిగనూరు లో తొలి కరోనా కేసు నమోదు

జిల్లాలో కరోనా కలకలం ఎమ్మిగనూరు లో తొలి కరోనా కేసు నమోదు


ఎమ్మిగనూరు, మే,16 (అంతిమతీర్పు-జి. మోహన్ రెడ్డి):-కరోనా మహమ్మారి ఎమ్మిగనూరు పట్టణానికి తాకింది. శనివారం కర్నూలు జిల్లాలో విడుదల చేసిన కరోనా  పాజిటివ్ కేసుల బులిటెన్ లో ఎమ్మిగనూరు పట్టణంలోని చంద్రయ్య కొట్టాల ( పెద్దకమేళ) 1, మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రం లో 2, కౌతాలం లో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని చంద్రయ్య కొట్టాల కు చెందిన ఓ లారీ డ్రైవర్ (40) కు జ్వరం తీవ్రంగా ఉండేది. గత 5రోజుల క్రితం ఆ డ్రైవర్ ను ఐసులేషన్ కు తరలించి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ప్రభుత్వం  విడుదల చేసిన బులిటెన్ లో ఇతనికి పాజిటివ్ గా వచ్చినట్లు ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనరు జి.రఘునాథ్ రెడ్డి శనివారంవిలేకరులకు  తెలిపారు. డ్రైవర్ తో కలీసిన మరో 12 మందిని బనవాసి ఫారంలోని క్వరంటైన్ కు పంపారు. లారీ డ్రైవర్ గత 20 రోజుల పాటు చెనై లోని కోయమ్బేడు మార్కెట్ కు వెళ్లి వచ్చినట్లు సమాచారం. డ్రైవర్  తల్లితో పాటు ఎమ్మిగనూరు లో  నివాసం ఉంటున్నారు. ఇతని బార్య పిల్లలు కర్నాటక లో ఉంటున్నారు. ఇన్ని రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఎమ్మిగనూరు పట్టణంలో  పాజిటివ్  కేసు రావడంతో ప్రజలు అందోళనకు గురి అవుతున్నారు.అలాగే మంత్రాలయం నియోజకవర్గం లోని కోసిగి మండలంలో 2,కౌతాళం మండలం లో ఒకటి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆయా మండలాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు రావడంతో ప్రజలంతా  ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు  తహశీల్దార్ వెంకటేశ్వర్లు,
 మున్సిపల్ కమీషనరు రఘునాథ్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్,ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ డి.బాలయ్య  చంద్రయ్య కొట్టాల వీధికి వెళ్లి పరిసరాలను శుభ్రపరిచారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు