ఏ.పి.టి.ఎఫ్ అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

*ఏ.పి.టి.ఎఫ్ అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ* వింజమూరు, మే 8 (రిపోర్టర్ - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం జనార్ధనపురం గ్రామంలోని  ఎస్.సి, బి.సి కాలనీలలోని పేద ప్రజలకు శుక్రవారం నాడు అంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏ.పి.టి.ఎఫ్- 1938) ఉపాధ్యాయ సంఘం అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ.పి.టి.ఎఫ్ మండల శాఖ అధ్యక్షులు జక్కం.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ విధించడం వలన మన దేశంలో ఈ వైరస్  అధికం కాకుండా కట్టడి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా అటు పాజిటివ్ కేసులు, ఇటు మరణాలు మిగతా దేశాలతో పోలిస్తే మన పరిస్థితులు కొంత మెరుగ్గానే ఉన్నాయన్నారు. ప్రజలందరూ స్వీయ నిర్భంధంలో ఉంటూ తగు జాగ్రత్తలు పాటించడం కూడా ఇందుకు దోహదపడ్డాయన్నారు. కనుక ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు అందించే సూచనలు, సలహాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆచరణలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లాక్ డౌన్ సమయంలో కూలీ పనులు అంతంత మాత్రంగా ఉన్నందున పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు ఇప్పటికే ఏ.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విరివిగా సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నాయన్నారు. బియ్యం, వంట సరుకులు, పౌష్టికాహారం తదితరాలను ఇప్పటికే పలు చోట్ల పంపిణీ చేయడం జరిగిందని, తాజాగా జనార్ధనపురం కాలనీలలో కూరగాయలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతలు పర్వతరెడ్డి కొండారెడ్డి, ఎస్.కే.నాయబ్ రసూల్, యం.వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు