జనం మెచ్చిన ఝాన్సీరాణి ...
కర్తవ్యంలో రాజీలేని డేరింగ్ అధికారిని ...
కావలి మే 7,( అంతిమ తీర్పు) : క్రమశిక్షణ ,సిన్సియారిటీకి ఆమె వారసురాలు...కొలువుతీరిన ప్రతిచోట ఆమెకు ప్రశంసలు... విధి నిర్వహణలో నిక్కచ్చితనం ఆమె సొంతం.. అవినీతి పరుల గుండెల్లో ఆమె ఝాన్సీ రాణి ..ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా రాజీ పడని నైజం ఆమె వ్యక్తిత్వం.... నిజాయితీకి చిరునామా ఆమె నడవడిక.. విధి నిర్వహణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చలించని పోరాటతత్వం ఆమె నైజం ...
నిబంధనలు ఉల్లంఘిస్తే ఆమె లాఠీకి చెబుతోంది పని.. అక్రమంగా సారా కాసే వారిపై తన పంజా దెబ్బ విసురుతుంది... ఉక్కుపాదం మై అవినీతిపరుల గుండెల్ని చిలుస్తుంది.. నిరంతరం కొలువే జీవితమై శ్రమిస్తోంది...ఆమె ఎవరో కాదు... కావలి జనం మెచ్చిన ఝాన్సీ రాణి ... ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ లో సీఐగా విధులు నిర్వహిస్తున్న నిజాయితీ మారుపేరుగా నిలిచిన అధికారి అరుణ కుమారి... అవినీతిపరులపై లాఠీ రులిపిస్తున్న , ఆ డేరింగ్ అధికారిపై ఓ ప్రత్యేక కథనం...2009 బ్యాచ్ కు చెందిన అరుణకుమారి ఏ పిపిసి గ్రూప్2 లో సెలక్ట్ అయి తొలుత ప్రకాశం జిల్లా దర్శిలో ప్రొహిబిసిషన్ ఎక్ససెజ్ లో యస్.ఐ గా ఉద్యోగంలో చేరారు. అక్కడ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించడంతో అటు ప్రజలు ఇటు అధికారులనుంచి మన్ననలు పొందారు. ఆ తరువాత ,సింగరాయకొండ, పొన్నూరులలో విధి నిర్వహణ చేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కొలువు చేసిన ప్రతి చోట ప్రజలు నుంచి ఆమె ప్రశంశల అందుకొంది. క్రమశిక్షణ,నిజాయితీగా పనిచేయటంతో ఆ శాఖ అధికారులు నుంచి కితాబులు అందుకొంది. అనంతరం 2018 వ సంవత్సరం లో పదోన్నతి పై కావలి సిఐగా అడుగుపెట్టారు. అప్పుడు నుంచి కావలిలో విధులు నిర్వహిస్తు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. రాజీకీయక నాయకుల వత్తిళ్ళకు నెరవక విధి నిర్వహణ చేస్తూ శెభాష్ అంటూ ప్రజల చేత ప్రశంసలు అందుకొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో నిక్కచ్చిగా విధి నిర్వహణ చెయ్యడంతో మద్యం నియంత్రణ చెయ్యడంలో సక్సస్ అయింది.కావలి డివిజన్ లో నాటు సారా అరికట్టేందుకు తన వంతు కృషి చేసింది. నాటు సారా తయారీ దారులను పట్టుకొని కేసులు నమోదు చేసింది. రాత్రుళ్ళు గస్తీ పెట్టి కావలి ప్రాంతంలో అక్రమ సారాతయారీదారుల ఆట కట్టించింది. కరోనా వల్ల లాక్ డౌన్ నేపథ్యంలో కావలి డివిజన్ లోని 18 మద్యం దుకాణాలలో ఎక్కడ అవకతవకలు జరగాకుండా విధి నిర్వహణ చేసేరు. లాక్ డౌన్ 50 రోజుల్లో మద్యం లేకుండా విధి నిర్వహణ చేసి మంచి అధికారిగా ప్రజల ప్రసంసలు అందుకున్నారు. కరోనా పై బాబులను చైతన్యం చేస్తూ విధి నిర్వహణ చేస్తూoది. అవినీతి పరుల గుండెల్లో ఆమె సింహంలా వ్యవహారించడంతో కావలి డివిజన్ కు చెందిన ప్రజలు .ముద్దుగా ఝాన్సీలక్ష్మి అని పిలవడం గమనార్హం.