ముద్దాయి పాలన రాష్టానికి ముప్పు గా మారింది : కళా వెంకట్రావు

   07.05.2020


ముద్దాయి పాలన రాష్టానికి ముప్పు గా మారింది : కళా వెంకట్రావు



మూడు విధ్వంసాలు ఆరు అరాచకాలు గా ఏడాది పాలన 


   
           కళా వెంకట్రావు



ఒక ముద్దాయి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఏపీని చూసి దేశ ప్రజలందరూ తెలుసుకున్నారు.11 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి మన రాష్టానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం.ప్రపంచ వ్యాప్తంగా ఆంద్రప్రదేశ్ ప్రతిష్ట మంటగలిపి 12 నెలల పాలనలో నే రాష్టాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారు.మూడు విధ్వంసాలు ఆరు అరాచకాలు గా ఏడాది పాలన సాగింది.
 జగన్ లో నేరస్తునికి ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కానీ నాయకునికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా జగన్ లో లేదు.జగన్ తీసుకుంటు న్న నిర్ణయాలు రాష్ట్ర నికి ముప్పు గా మారాయి. ఏడాదిలోనే  వ్యవస్తలన్నింటిని నాశనం చేశారు.  ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదు, నవరత్నాలు పేరు తో నవ మోసాలకు పాల్పడ్డారు.రాజధాని అమరావతి ని 3 ముక్కలు చేసి రాష్టాన్ని రాజధాని లేని అనాథను చేసారు.3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల్లో ను వైసీపీ నేతలు కబ్జాలు, దౌర్జన్యాలు, దందాలు చేస్తున్నారు.
  పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీ న్లు రద్దు చేసి పేద మహిళల పుస్తెలు తెంపే మద్యం దుకాణాలు తెరిచారు.ఉచిత ఇసుకను రద్దు చేసి వైసీపీ నేతలకు కమీషన్లు పెంచి సామాన్యులకు ఇసుక అందకుండా చేసారు.కమీషన్ల కక్కుర్తి తో పోలవరం ఆపేశారు. రైతులకి ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. కరోనా ప్రభావం లో మద్యం దుకాణాలు తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. మద్యం ధరలు పెంచి వారి రక్తం పిండుతున్నారు. బడుల్లో పిల్లలలుకు పాఠాలు చెప్పే టీచర్లకు వీధుల్లో మందు బాబులను కంట్రోల్ చేసే పరిస్థితి తెచ్చారు. ఏడాదిలొనే జగన్     కోర్టులు చేత  64 సార్లు చివాట్లు తిన్నారు. కరోనాని చూసి ప్రజలు ఎలా భయపడుతున్నారో జగన్  జే టాక్స్ ని చూసి పారిశ్రామిక వేత్తలు భయపడు తున్నారు .వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.భవిష్యత్ లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మం గారు చెప్తే ఎవరి గురించో అనుకున్నాం, కానీ ఆయన చెప్పింది వైసీపీ నేతల  గురించేన ని ఇప్పుడు ప్రజలకు అర్ధమైంది.


s/d 
కళా వెంకట్రావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు