చిత్తూరు, మే 11 (అంతిమ తీర్పు) : నేను పుట్టిన ఊరు కాకుండా నన్ను రెండు సార్లు అభిమానించిన ఊరు ప్రజల కోసం వారి ఇబ్బందులు పడుతుంటే వారికి సేవ చేయాలని భావించాను అందులో భాగంగానే ప్రజల సహాయం పలు పనులు చేపట్టానని నగిరి శాసనసభ్యురాలు మరియు ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా అన్నారు. ఏడు చిత్తూరులో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎస్పీ సెంథిల్ కుమార్ ల ఆధ్వర్యంలో బాగా పని చేశారని వాలంటీర్ నుంచి కలెక్టర్ వరకు అందరూ కలసి సమన్వయంతో పని చేయడం వల్లే ఇలాంటి మరణాలు లేకుండా దాదాపు బాధితుల అందరి ఇంటికి పంపారని అయితే ఇదే సమయంలో చెన్నై కోయంబేడు మార్కెట్ కు సంబంధించి కేసులు రావడం బాధగా ఉందని అయినా జిల్లా యంత్రాంగం ఈ సమస్యను కూడా కట్టడి చేయడం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా ను కట్టడి చేయడంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అధికారులతో సంప్రదించి దిశానిర్దేశం చేస్తూ దేశంలోని అత్యధికంగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రజల ఆరోగ్యం భాగ్యంగా ఆయన పని చేస్తున్నారని అదేవిధంగా విశాఖలో జరిగిన సంఘటన ఆయన వ్యవహరించిన తీరు అదేవిధంగా ఆ కుటుంబాలను అక్కున చర్చుకొన్నే విధానం చూసి యావత్ దేశం అబ్బుర పడుతోందని ఎమ్మెల్యే రోజా అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో నియోజకవర్గానికి సంబంధించిన పరిశ్రమల అనుమతులు గురించి అదేవిధంగా కరుణ ప్రభావంతో భౌతిక దూరం గురించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు