విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
—————————————————. మత్స్య కారులకు అండగా ఉంటాం
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- ఈ నేపథ్యంలో రూ.16
లక్షల ఖర్చుతో
ఐదు కేజీల బియ్యంబస్తాలు 8 వేల మందికి పంపిణీ
-అలాగే కుటుంబానికి 4 గుడ్లు కూడా ...
-హర్షాన్ని వ్యక్తం చేస్తున్న మత్స్య కారులు
-త్వరలో దక్షిణంలో మరో ఎనిమిదివేలమందికి పంపిణీ
లాక్ డౌన్ సమయంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇప్పటికే తన పార్లమెంట్ పరిధిలో ఆరిలోవ తదితర ప్రాంతాలలో రూ.15
లక్షల ఖర్చుతో ఐదుకేజీల చొప్పున 16 వేలమందికి కూరగాయలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పేదలకు బాసటగా నిలిచినా ఎంవీవీ, తాజాగా మత్స్యకారులకు బాసటగా నిలిచారు.తూర్పు నియోజకవర్గ పరిధి 19 వ వార్డులో ఉన్న ఎనిమిది వేల నిరుపేద మత్స్య కార కుటుంబాలకు తోడుగా నిలిచారు.వారి ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితిని గమనించి రూ.16
లక్షల రూపాయల సొంత నిధులతో ఐదు కేజీల నాణ్యమైన బియ్యంబస్తా తో పాటు,పౌష్టికాహార౦ గా కుటుంబానికి నాలుగు కోడిగుడ్లను లా సన్స్ బే కాలనీ పార్టీ ఆఫీస్ లో ఆయనచేతుల మీదుగా స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ గౌ.ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి గారి పర్యవేక్షణలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సఫలీకృతులం అవుతున్నామన్నారు.ఆయన చూపిన మార్గంలో వెళుతూ ప్రతిపేదవాడి క్షుద్భోద తీర్చేందుకు నిరంతరం గా తమవంతు కృషిచేస్తున్నామన్నారు.మరో మూడు,నాలుగు రోజుల్లో దక్షిణ నియోజక వర్గంలో ,ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఎనిమిదివేలమంది కి బియ్యం తదితర సరుకులు పంపిణీకార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఈ సందర్భంగా మత్స్య కారులు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
మత్స్య కారులకు అండగా ఉంటాం : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ