కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లా క్ డౌన్ సందర్భం గా రైతులను విస్మరించడం సరైనది కాదు
కౌతాళం,మే,16 (అంతిమతీర్పు):-కౌతాళం మండలంలోని ఏపీ రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు లాక్ డౌన్ వల్ల అన్నదాతలు కష్టాలను ఎదుర్కొంటూ పంటలు పండిస్తూ సమాజానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలకు అభినందన అభినందన సభను శనివారం ఈరన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బి.పమన్న అనే రైతును పూలమాలతో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మల్లయ్య సన్మానం చేయడం చేశారు.రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము 20 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎటువంటి నిధులు కేటాయించడం లేదన్నారు. రైతు రేయింబవళ్లు కష్టపడి పంటలు పండిస్తున్న రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని వారు తెలిపారు.రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి,రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలి,రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ,మద్దతు ధర కల్పించాలి,.రైతులకు ఉచితముగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందించాలి. రైతులకు పెట్టుబడి సాయం రు 13,500 నుండి 18,000 రూపాయలు కుపెంచాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఈరన్న, నాయకులు ఉల్లి కయ్య ,కార్యకర్తలు హనుమంతు, కరిలింగా, గోవిందు , వీరేష్, ముకన్న, శేఖర్ , వెంకన్న, వలి తదితరులు పాల్గొన్నారు.