మోటచింతలపాళెంలో పౌష్టికాహారం పంపిణీ
వింజమూరు, మే 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలోని మోటచింతలపాళెం అంగన్ వాడీ కేంద్రంలో అంగన్ వాడీ కార్యకర్త కె.వెంకట రమణమ్మ నేతృత్వంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణమ్మ మాట్లాడుతూ జిల్లా స్త్రీ శిశు సం క్షేమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలలో భాగంగా వింజమూరు ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ పద్మావతి ఆదేశాల మేరకు ప్రస్తుత కరోనా సమయంలో ముందు జాగ్రత్త చర్యలుగా అంగన్ వాడీ కేంద్రంలో పౌష్టికాహార సరుకులను ఇంటింటింకీ పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గర్భవతులు, బాలింతలకు 7 నెలల నుండి 3 సంవత్సరాల వరకు బాలామృతం పంపిణీ చేశామన్నారు. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు కలిగిన వారికి బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, నూనె ప్యాకెట్లు, రాగిపిండి, గోధుమ పిండి , బెల్లం, చిక్కిఉ, ఖర్జూరం తదితరాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ యేడాది మార్చి నెల నుండి జూన్ నెల వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.