క్లస్టర్ల విభజనకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు :కృష్ణా జిల్లా   కలెక్టర్ ఏ ఎండీ ఇంతియాజ్

క్లస్టర్ల విభజనకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు
 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ల విభజనకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని కృష్ణా జిల్లా   కలెక్టర్ ఏ ఎండీ ఇంతియాజ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన లో పేర్కొన్నారు.


 జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం  క్లస్టర్లను గుర్తించిందన్నారు. గడిచిన 5 రోజుల్లో కేసులు రికార్డయితే అది వెరీ యాక్టివ్‌ క్లస్టర్‌గాను, గడిచిన 6 నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైనా( 5 రోజుల్లోగా కేసులు లేకపోతే) వాటిని  యాక్టివ్‌ క్లస్టర్‌ గాను  గడిచిన 15 నుంచి 28 రోజుల్లో కేసులు నమోదైనా ( 15 రోజుల్లోగా కేసులు నమోదు కాకపోతే ) వాటిని  డార్మంట్‌ క్లస్టర్‌ గాను, 28 రోజులుగా కేసులు నమోదు కాకపోతే గ్రీన్ జోన్ గాను గుర్తిస్తా మన్నారు.


ఒక గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ కి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రీన్ నుంచి రెడ్ జోన్ కి , రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి అనుమతులు ఇవ్వడం జరగదన్నారు.


కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పాజిటివ్‌ కేసు ఉన్న ఇంటి నుంచి ప్రారంభమై 500 మీటర్ల నుంచి 1 కి.మీ వరకూ 3 కిలోమీటర్ల వరకూ బఫర్‌ జోన్‌  (కేసు ఉన్న ఇంటి నుంచి దూరంతో కలుపుకుని)  కేసుల సంఖ్య, కాంటాక్ట్స్, తీవ్రతను బట్టి జిల్లా అధికారులు పరిధిని నిర్ణయిస్తామన్నారు.


. అర్బన్‌ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ కాలనీలు, మున్సిపల్‌ వార్డులు వారీగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు,  కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌కు సమీపంలో ఉన్న వార్డులు, కాలనీల్లో సర్వేలెన్స్‌ కొనసాగుతుందన్,  రూరల్‌ ప్రాంతాల్లో పంచాయతీల ప్రాతిపదికన కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ కేసులు, కాంటాక్టులను బట్టి అధికారులు దీనిచుట్టూ పరిధిని పెంచే అవకాశం ఉంటుంది. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో బారికేడ్లతో రోడ్ల మూసివేతతో పాటు అన్నిరకాల కదలికలు నిషేధం. నిత్యావసరాలకు ఇంటికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారన్నారు.. వీలైనంత వరకూ ఇంటివద్దకే నిత్యావసరాల పంపిణీ చేస్తామని, 
కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల వద్దకే మొబైల్‌ వాహనాలతో నిత్యావసరాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. వ్యక్తుల కదలికలన్నీ రికార్డు చేస్తామని, ప్రతి కుటుంబం ఆరోగ్యపరిస్థితులపై సంపూర్ణంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. కేసులు వారి కాంటాక్టుల వివరాలను 12, 24 గంటలకోసారి అప్‌డేట్‌ చేస్తారని, వైరస్‌ సోకినవారికి ఉన్న లక్షణాలను బట్టి క్వారంటైన్‌కు తరలిస్తారన్నారు. హై రిస్క్‌ ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రోటోకాల్‌. మంచి వైద్యం కోసం తరలిస్తారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లో ఉన్నవారంతా ఆరోగ్య సేతులో 100 శాతం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందేనన్నారు. .


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు