: ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి . పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హాజరైన అధికారులు
12.5.2020
అమరావతి
తాడేపల్లిలోని పిఆర్ కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం
హాజరైన పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సీఎం కార్యదర్శి సాలోమన్ ఆరోఖ్యరాజ్, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, పిఆర్ ఇఎన్ సి సుబ్బారెడ్డి, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు.
*మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్...*
- లాక్ డౌన్ తో రాష్ట్రంలో వుండిపోయిన వలస కూలీలకు ఉపాధి పనులు
- కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు ఉపాధి హామీ వర్తింపు.
- జిల్లాల వారీగా వలస కూలీలను గుర్తించి జాబ్ కార్డులను జారీ చేయాలి.
- లాక్ డౌన్ వల్ల పనులు లేక కూలీలు పస్తులు వుండే పరిస్థితి వుండకూడదు.
- ఈ ఏడాది కోటి పనిదినాలను కేంద్రం అదనంగా ఎపికి కేటాయించింది.
- పలు జిల్లాల్లో ఉపాధి హామీతో గ్రామీణ కూలీలకు పనులు కల్పిస్తున్నాం.
- కష్టసమయంలో ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి.
- ఇప్పటికే వివిధ జిల్లాల్లో వున్న వలస కూలీలను గుర్తిస్తున్నాం.
- వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఇక్కడే వుండిపోతున్నారు.
- వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా వుంది.
- రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు కూడా ఉపాధి హామీని వర్తింప చేస్తున్నాం.
- దీనితో ఎక్కువ మందికి పనులు లభిస్తాయి.
- అటు రైతులకు కూడా మేలు జరుగుతుంది.
- ఇంజనీరింగ్ శాఖల అధికారులు కూడా ఉపాధి హామీకి ప్రాధాన్యత ఇవ్వాలి