మద్యం దుకాణాలు వద్ద ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించేలా చూడండి : సిఎస్

*మద్యం దుకాణాలు వద్ద ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించేలా చూడండి.


*5గురుకు మించి గుమికూడరాదు.


*వ్యవసాయ, పారిశ్రామిక, నిర్మాణ రంగాల పనులు లేని వారినే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించాలి.
            
*గ్రామాల్లో కమ్యునిటి క్వారంటైన్ కేంద్రాల్లో తగిన వసతులు కల్పించాలి: సిఎస్.


అమరావతి,4మే: వ్యవసాయ, నిర్మాణ, పారిశ్రామిక రంగాల పనులు పూర్తయి వారి స్వంత జిల్లాలు లేదా రాష్ట్రాలకు వెళ్ళాలనుకునే కార్మికులను మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి జిల్లా లు రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, జెసిలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపధ్యంలో వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో గతంలో వివిధ పనుల నిమిత్తం వెళ్ళి అక్కడ ఉండి పోవడం జరిగిందని కాని ఇప్పుడు అందరినీ అవసరం ఉన్నా లేకున్నా వారి స్వస్థలాలకు తరలించడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ ఆదేశాలలో స్పష్టం చేసిందని తెలిపారు. కావున ఎక్కడైతే వ్యవసాయ, నిర్మాణ, పారిశ్రామిక రంగ పనులు పూర్తయి నిలిచిపోయిన వారు స్వస్థలాలకు వెళ్ళాలనుకునే వారిని మాత్రమే ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ స్పష్టం చేశారు.


మద్యం దుకాణాలు వద్ద 5గురు వ్యక్తులకు మించి గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. అదేవిధంగా దుకాణాలు వద్ద భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.ఒక వేళ ఈవిధంగా పాటించకుంటే ఆయా మద్యం దుకాణాల తలుపులను మూసి మద్యం కోనుగోలుకు పెద్ద సంఖ్యలో గుమికూడిన వారిని చెదరగొట్టి భౌతిక దూరం పాటిస్తేనే అమ్మ కాలు జరపాలని ఈవిషయంలో ఎక్సైజ్,పోలిస్ అధికారులు చర్యలు తీసుకునేలా కలెక్టర్లు చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.


అలాగే వివిధ ప్రాంతాల నుండి ఆయా గ్రామాల వచ్చే వారిని ఉంచేందుకు ప్రతి గ్రామంలో 10పడకలతో ఏర్పాటు చేస్తున్న కమ్యునిటీ క్వారంటైన్ కేంద్రాలలో తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల కేంద్ర హోం శాఖ మార్గ దర్శకాలకు అనుగుణంగా సాధారణ కార్యకలాపాలు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు.


కేసుల పాజిటివిటీ  రేషియో, కేసులు ఫెటాలిటీ రేషియో, వారం రోజుల వ్యవధిలో కేసుల డబిలింగ్ రేట్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‌


ఈవీడియో సమావేశంలో విజయవాడ ఆర్అండ్బి కార్యాలయం నుండి పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ క్లస్టర్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు మరికోన్ని తాజా ఆదేశాలను జారీ చేశామని వాటిని సక్రమంగా అమలు చేయాలని చెప్పారు.


 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు