*ముమ్మరం గా లేవుట్ నిర్మాణ పనులు*
వరికుంటపాడు ,:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా రూపొందించిన ఇంటి నివేశన స్థలాలకు సంబంధించి, వరికుంటపాడు మండలం లో లేవుట్ నిర్మాణ పనులు ముమ్మరo గా సాగుతున్నాయి. దారిద్ర్య రేఖ కు దిగువున ఉన్న కుటుంబాలకు చేయూత ని అందించే దిశగా ఈ పనులు జోరు గా సాగుతున్నాయి. శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తో అనువైన ప్రాంతాలను గుర్తించి లేవుట్ ల ఏర్పాటు చేయడం తో బాటు భూమి ని చదును చేసి ప్రొక్లైన్లు, ట్రాక్టర్ లు సాయం తో మట్టిని లేవుట్ లలో నింపి చదును చేస్తున్నారు. రోడ్డు రోలర్ సాయం తో నాణ్యత గా ప్లాట్ లను ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసారు. వరికుంటపాడు మండలం లోని 24 పంచాయతీ లలో 80 శాతం ఈ పనులు పూర్తి కానున్నాయి. తూర్పు బోయమడుగుల పంచాయతీ లోని అలివేలు మంగాపురం, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ లలో ఏర్పాటు చేసారు. అలాగే కాంచెరువు, ఇస్కపల్లి, జడదేవి, గువ్వడి తదితర గ్రామాల్లో ఈ పనులు వేగవంతం అయ్యాయి. ఈ పరిణామాలతో ప్రభుత్వం అందించే ఈ ఇంటి నివేశన స్థలాలు తమకు ఉచితంగా అందనుండడం సంతోషంగా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
ముమ్మరం గా లేవుట్ నిర్మాణ పనులు*