నా మీద,తెలుగుదేశం నాయకులపైన నిన్న రాత్రి  అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. -రాజేంద్ర ప్రసాద్ mlc

ప్రెస్ మీట్ -- ఉయ్యురు -- 4-5-2020


* *రెడ్ జోన్ విజయవాడ నుంచి వచ్చిగ్రీన్ జోన్ ఉయ్యురు లో  తిరుగుతున్న mla సారధిని వదిలి నా మీద కేసులు పెట్టడం అన్యాయం -రాజేంద్ర ప్రసాద్ mlc* 


* *లాక్ డౌన్ నిబంధనలు ప్రకారం రెడ్ జోన్ విజయవాడ నుంచి గ్రీన్ జోన్ ఉయ్యురు వస్తున్న సారథిని 15 రోజులు క్వారంటైన్ కి పంపాలి* 


 నా మీద,తెలుగుదేశం నాయకులపైన నిన్న రాత్రి  అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. -రాజేంద్ర ప్రసాద్ mlc*


2) పోలీసుల అక్రమ కేసులకు బయపడేదిలేదు. నిరంతరం ప్రజా సేవ చేస్తూనే ఉంటాం. 


3) CMRF సారథి ఇవ్వకపోతే మేం 20000 వేల రూపాయలు సహాయం చేశామని ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నామనే కేసులు కట్టారు. 


4) లాక్ డౌన్ వల్ల ఆకలితో అల్లాడుతున్న పేదలకు సహాయం చెయ్యడం నేరమా ? 


5) mla సారథి గారు 100 మంది ysr కార్యకర్తలతో ఉయ్యురులో రోజు తిరుగుతూ ప్రచారం చేస్తుంటే సారథి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? పైగా పోలీసులు కాపలాగా సారథి వెంట ఎందుకు తిరుగుతున్నారు? 


6) 7, 11 వార్డుల్లో మొన్న సారథి పోలీసు C i, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులను 100 మంది ysr కార్యకర్తలను వేసుకొని సారథి ప్రచారం చేసారు. దానికి C.i, కమిషనర్లే సాక్షం. మరి సారథి గారి మీద కేసు పెట్టారా? 


7) 4రోజుల క్రితం సారథి ఉయ్యురు సెంటర్లో అన్నదానం పేరుతో 500 మందిని పోగు చేస్తే, తొక్కిసలాట జరగలేదా? అది లాక్ డౌన్ ఉల్లంఘన క్రిందకు రాదా? సారథి మీద కేసు పెట్టారా? 


8) కరోనా కేసులు తీవ్రంగా వున్న రెడ్ జోన్ ఏరియా విజయవాడ నుంచి కేసులు లేని గ్రీన్ జోన్ ఏరియా మా ఉయ్యురుకు సారథి రోజు వచ్చి 100 మందితో తిరుగుతూ కరోనా వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారు. 


9) కనుక రెడ్ జోన్ విజయవాడ సిటీ నుంచి గ్రీన్ జోన్ ఉయ్యురు మున్సిపల్టి కి  వచ్చి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కరోనాని వ్యాప్తి చేస్తున్న సారథి పై వెంటనే కేసులు పెట్టాలని క్వారంటైన్ చెయ్యాలని పోలీసు కమిషర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. 


10) సారథి ఉయ్యురులో తిరిగినన్ని రోజులు నేను తిరుగుతూనే వుంటాను. ఇద్దరి మీద కేసులు పెట్టండి. పోలీసులు పక్షపాతం చూపిస్తే సహించం. 


11) రెడ్ జోన్ కరోనా కేసులున్న విజయవాడ నుంచి సారథి గారు రోజు ఉయ్యురు వచ్చి తిరిగితే తప్పు లేదు కానీ, నా స్వగ్రామం  గ్రీన్ జోన్ అయిన ఉయ్యురులో   నా ఊర్లో నేను తిరిగితే తప్పా? 


12) సారథి తిరిగితే నేను తిరుగుతా. సారథి మీద కూడా కేసులు పెట్టి ఆపితే నేను ఆగుతా.కేసులకు భయపడేది లేదు. ప్రజా సేవే మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం. వెనకంజ వేసేది లేదు. 


13) రెడ్ జోన్, కరోనా  కేసులున్న విజయవాడ సిటీ నుంచి  mla సారథి కరోనా కేసులులేని ఉయ్యురు గ్రీన్ జోన్ కి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తి చెయ్యడం నేరం కాదా? రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి రావద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు పెట్టడం వాస్తవం కాదా? 


14) సారథి ఉయ్యురు వస్తే క్వారంటైన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.


15) బాధ్యత గల పౌరుడిగా చట్టాన్ని పోలీసు నిబంధనలను గౌరవిస్తాను అమలు చేస్తాను. అలాగే సారథి గారికి కూడా అదే చట్టాన్ని నిబంధనలని వర్తింప చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము -- రాజేంద్ర ప్రసాద్


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image