నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ

నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ


వింజమూరు, మే 17, (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో ఆదివారం నాడు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ మాంసం విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యక్తులకు పంచాయితీ సెక్రటరీ బంకా.శ్రీనివాసులు రెడ్డి 5 వేల రూపాయలను జరిమానాలుగా విధించారు. ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా గత నెల రోజుల వ్యవధిలో ఆదివారం దినములలో చికెన్, మటన్, చేపల విక్రయాలు జరపరాదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న విషయాలు అందరికీ తెలిసిందే. ఆదివారం సమయాలలో ఈ దుకాణాల వద్ద రద్దీ అధికంగా ఉంటుందని, ఈ పరిణామాలు కరోనా వైరస్ వ్యాప్తికి కారణభూతాలవుతాయనే ఉద్దేశ్యంతో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు దిశగా అడుగులు వేస్తున్నారు. వింజమూరులోని బంగ్లాసెంటర్, షఫి హాస్పిటల్ వీధి, దేవతా మహల్ సెంటర్, గంగమిట్ట తదితర ప్రాంతాలలో మాంసం విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ప్రజలు సమదూరం పాటిస్తేనే కరోనా వైరస్ కట్టడి సాధ్యమని భావించిన అధికారులు ఆదివారాలలో మాంసం దుకాణాల వద్ద ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు ఈ అమ్మకాలపై నిషేదం విధించారు. కానీ కొంతమంది వ్యాపారులు రహస్య ప్రదేశాలలో మాంసం విక్రయాలకు నడుం బిగించారు. వీటిపై నిఘా ఉంచిన పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి ఆదివారం నాడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తమ సిబ్బందితో పలు ప్రాంతాలలో సోదాలు చేసి నలుగురు మాంసం విక్రయదారులకు 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అందరూ కంకణ బద్ధులై ఉండాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉందన్నారు. లాక్ డౌన్ నిబంధనల అంశాల విషయంలో ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image