విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనపై గవర్నర్ దిగ్ర్బాంతి

విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనపై గవర్నర్ దిగ్ర్బాంతి


మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించిన బిశ్వ భూషణ్


సహాయ, పునరావాస చర్యలపై సియంతో చరవాణిలో మాట్లాడిన గవర్నర్


వైద్య శిబిరాల నిర్వహణలో సహాయపడాలని రెడ్ క్రాస్ శ్రేణులకు అదేశం


 


            విజయవాడ, మే 07: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటపురం గ్రామంలోని ఎల్ జి పాలిమార్స్ కర్మాగారంలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీకైన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూసన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపధ్యంలో గవర్నర్ ప్రభుత్వ పరంగా జరుగుతున్నసహాయ, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో చరవాణి ద్వారా మాట్లాడారు. బాధితులకు సత్వర సహాయం అందించే దిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాననీయ గవర్నర్ కు వివరించారు.  జిల్లా యంత్రాంగం  చేపట్టిన వేగవంతమైన చర్యలతో పాటు,  ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించడం, సాయిధ దళాలు స్వచ్ఛందంగా సహాయ చర్యలలో పాల్గొనటం వంటి అంశాలను గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి వివరించారు.


               సహాయ, తాత్కాలిక పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో బాధితులకు మెరుగైనా సేవలు అందుతున్నాయని సిఎం గవర్నర్‌కు తెలియజేశారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది మరణించారని, మూడువందలకు పైగా ప్రజలు ఆసుపత్రులలో ప్రాణాపాయ స్దితిలో ఉన్నారని గవర్నర్ గుర్తించారు. బాధిత వ్యక్తులకు ఆస్పత్రులలో అత్యున్నత వైద్యం అందించాలని గవర్నర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద ఫలితంగా మృతి చెందిన వారి కుటుంబ  సభ్యులకు గౌరవ గవర్నర్ తీవ్ర సంతాపం తెలిపారు. చికిత్స పొందుతున్న బాధితులు వేగంగా కోలుకోవాలన్న ఆశాభావం వ్యక్తం చేసారు. మరోవైపు గవర్నర్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే రెడ్ క్రాస్ వ్యవస్ధను సమాయత్త పరిచిన బిశ్వ భూషన్ సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించటమే కాక, రెడ్ క్రాస్ వైద్య  బృందాలు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేలా చూడాలని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు సూచించారు. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల రెడ్ క్రాస్ వాలంటీర్లు కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు