*క్వారంటైన్ సెంటర్ వద్ద హైపోక్లోరైడ్ పిచికారీ* వింజమూరు, మే 12 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద మంగళవారం నాడు ఉదయం పంచాయితీ సిబ్బంది పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. వింజమూరులో గత కొన్ని రోజుల నుండి నూతన ప్రభుత్వ వైద్యశాలలో అధికారులు క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి ఈ క్వారంటైన్ సెంటరుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఓ వైపు క్వారంటైన్ సెంటరు ఉండగా, మరోవైపు సాధారణ వైద్య సేవలు నిర్వహిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తరచూ ఆసుపత్రి పరిసరాలలో భ్లీచింగ్ చల్లించడంతో పాటు వ్యాధుల కారక క్రిములను నిర్మూలించే హైపోక్లోఫైడ్ ద్రావణమును పిచికారీ చేయిస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దగ్గరుండి ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేయించడంతో పాటు క్వారంటైన్ గదుల వద్దకు చేరుకునే మార్గాలలోనూ, గదులలోనూ హైపోక్లోరైడ్ ద్రావణమును పిచికారీ చేయించారు.
క్వారంటైన్ సెంటర్ వద్ద హైపోక్లోరైడ్ పిచికారీ