మధ్యం షాపుల వద్ద నిబంధనలు పాటించాలి :- వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి
వింజమూరు, మే 6 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): మద్యం షాపుల వద్ద అటు నిర్వాహకులు గానీ, ఇటు మద్యం ప్రియులు కానీ ఖచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నాడు ఆయన పలు మద్యం షాపుల ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాఫు. ఎస్.ఐ వాహనాన్ని గమనించి మద్యం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉన్న మందుబాబులు పరుగులందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ విషయంలో షాపుల నిర్వాహకులు కరోనా వైరస్ కట్టడి లక్ష్యంగా భాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినా కొన్ని నియమ నిబంధనలతో పాటు పరిమితులను కూడా తెలియజేయడం జరిగిందన్నారు. షాపుల ముందు భాగంలో సమదూరం పాటించే విధంగా మార్కింగులు వేయాలని నిర్వాహకులకు సూచించారు. మాస్కులు ధరించిన వారికే మద్యం ఇవ్వాలన్నారు. మద్యం కొనుగోలు సమయంలో గుంపులు గుంపులుగా ఉండకుండా కౌంటర్ల వద్ద ఉంటున్న నిర్వాహకులే అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం ప్రియులు కూడా గతంలో మాదిరిగా మద్యం సేవించి రోడ్లుపై సంచరించరాదన్నారు. పూటుగా మద్యం సేవించి వీధుల వెంబడి తిరగడం, ద్విచక్రవాహనాలలో డబుల్, త్రిబుల్ వెళ్ళడం వాంటివి ఉపేక్షించబోమని ఎస్.ఐ బాజిరెడ్డి స్పష్టం చేశారు.