ఉద్యోగ, కార్మిక సంక్షేమంలో టిడిపి అగ్రగామి: చంద్రబాబు
-పసుపు ‘‘జెండాలో కార్మిక చక్రం’’ స్ఫూర్తిగా పని చేయాలి
అన్నా కేంటిన్లు, బీమా పునరుద్దరించాలని డిమాండ్
మే డే సందర్భంగా టిడిపి సమావేశం. ఆన్ లైన్ లో టిడిపి మే డే నిర్వహణ.
పాల్గొన్న ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు, టిడిపి నాయకులు. సమావేశంలో పాల్గొన్న దాదాపు 1000మంది
తన నివాసం నుంచే ఆన్ లైన్ లో ‘‘మేడే సందేశం’’ ఇచ్చిన చంద్రబాబు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ‘‘ కార్మికులు అందరికీ ‘‘మే డే’’ శుభాకాంక్షలు. కార్మిక చైతన్యానికి స్పూర్తి ‘‘మే డే’’. కార్మికుల హక్కుల సాధనకు నాంది మే డే. కార్మిక సంక్షేమానికి ప్రతిజ్ఞాదినం మే డే.
ప్రస్తుత కరోనాలో కార్మికులు బైటకు రాలేని పరిస్ధితి. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. కార్మికుల హక్కుల సాధనకు టిడిపి పునరంకితం కావాలి.
కష్ట పడకుండా ఫలితాలు రావు. వివిధ రంగాల్లో కార్మికుల కష్టం వల్లే సంపద సృష్టి. కార్మికుల కష్టాల ఫలితాలే సమాజంలో ప్రజలంతా అనుభవిస్తోంది.
టిడిపి జెండాలో కార్మికుల చక్రం, రైతన్న నాగలి, పేదవాడి గుడిసె. టిడిపి జెండా పసుపు రంగు శుభసూచకం. కార్మికులకు న్యాయం కోసమే ఎన్టీఆర్ టిడిపి నెలకొల్పారు.
కార్మికుల సంక్షేమం కోసం టిడిపి 38ఏళ్లుగా కృషి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పనిచేశాం. దేశంలో ఎవరూ చేయని చట్టాలు చేశాం. టిడిపి ప్రభుత్వం చేసిన చట్టాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం. ప్రతిపక్షంలో ఉంటూ కార్మికుల సమస్యలపై పోరాడాం.
ఈ క్లిష్ట సమయంలో కార్మికులకు అండగా ఉండాలి:
కరోనా లాక్ డౌన్ లోనూ కార్మికుల త్యాగాలు నిరుపమానం. కోవిడ్ వైరస్ నియంత్రణకు ఫ్రంట్ లైన్ వారియర్లుగా పోరాడుతున్నారు. ప్రాణాలు లెక్కచేయకుండా పారిశుద్య కార్మికులు పని చేస్తున్నారు. నర్సులు, డాక్టర్లు, పారామెడికల్, రవాణా సిబ్బంది, పోలీసులు కృషి చేస్తున్నారు.
రెక్కాడితేగాని డొక్కాడని కార్మికుల బాధలు. వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలి.
ఫ్రంట్ లైన్ వారియర్లకు భద్రతా పరికరాలు( పిపిఈలు) ఇవ్వాలి. పూర్తి స్థాయిలో జీతాలు సకాలంలో చెల్లించాలి.
కేంద్రం ఇప్పటికే రూ 50లక్షల బీమా ప్రకటించింది. ఈ రూ 50లక్షల బీమా ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి.
కరోనాలో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో కోతలను వ్యతిరేకించాం. పూర్తి జీతాలు చెల్లించాలని పోరాడాం.
టిడిపి హయాంలో కార్మికుల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం:
టిడిపి హయాంలోనే అసంఘటిత కార్మికుల కోసం ‘‘బీమా’’ పెట్టాం. రూ 5లక్షలు ప్రమాద బీమా సదుపాయం కల్పించాం. ప్రమాద బీమా మొత్తం రూ 10లక్షలకు పెంచుతామని టిడిపి మేనిఫెస్టోలో చెప్పాం.
పేద కార్మికుల కోసమే ‘‘అన్నా కేంటిన్లు’’ పెట్టాం. రూ 5కే పేదలకు నాణ్యమైన ఆహారం అందించాం. అన్నా కేంటిన్లు రద్దు చేయడం దారుణం.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి టిడిపి పెద్దపీట. భవన నిర్మాణ నిధిని టిడిపి ప్రభుత్వమే ప్రారంభించింది. ప్రస్తుతం భవన కార్మిక నిధి రూ1,900కోట్లు ఉండాలి. అందులో ప్రతి కార్మికుడికి రూ 10వేలు ఇవ్వాలని కోరాం. ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో స్పందన లేదు.
టిడిపి హయాంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు 50% పెంచాం. చిరుద్యోగుల వేతనాలు 100% పెంచాం.
అంగన్ వాడీ వర్కర్లకు రూ.4,000లు నుండి రూ.12,000 చేశాం. అంగన్ వాడి ఆయాల జీతాలు రూ.2,500 నుండి 7,000కు పెంచాం. ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాం.
ఏ రాష్ట్రంలో లేని విధంగా రిటైర్డ్ అయిన అంగన్ వాడీ టీచర్లకు రూ.50,000, ఆయాలకు రూ.25,000 రిటైర్మెంట్ బెనిఫిట్
ఉద్యోగుల సంక్షేమానికి టిడిపి పెద్దపీట:
ఉద్యోగుల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం 60నెలల్లో 60జివోలు తెచ్చాం. తీవ్ర ఆర్ధిక లోటులో కూడా 43% ఫిట్ మెంట్ తో పిఆర్ సి ఇచ్చాం. సచివాలయ ఉద్యోగులకు 5రోజుల పనిదినాలు కల్పించాం. 11వ పి.ఆర్.సి కమీషన్ వేశాం. 20 % ఐఆర్ మంజూరు చేశాం.
సమైక్య ఆంధ్ర పోరాటంలో కేసులు తొలగించాం. 90రోజుల ఉద్యమ కాలాన్ని ఉద్యోగులందరికి డ్యూటీగా పరిగణించి పూర్తి జీతాలు చెల్లించాం.
సి.పి.ఎస్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్, గ్రాట్యుటి పెంచాం. సి.పి.ఎస్ రద్దు పరిశీలనకు చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీ వేశాం.
సెక్రటేరియట్ ఉద్యోగులకు, హెచ్ వోడి లకు హైదరాబాద్ తో సమానంగా హెచ్ ఆర్ ఇచ్చాం. రూ398 వేతనంతో పనిచేసే టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చాం.
రూ 10కోట్లతో డ్రైవర్ల సాధికార సంస్థ పెట్టాం. ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు బీమా కల్పించాం. వాహన యజమానులుగా చేసేందుకు వారికి చేయూత అందించాం.
చేతివృత్తులు, కుల వృత్తుల వారికి, ఆదరణ-2 పథకం తెచ్చాం. అంతరించి పోతున్న 125 కుల వృత్తుల వారిని ఆదుకున్నాం. రూ 900కోట్లతో ఆధునిక పనిముట్లు పంపిణీ చేశాం, వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం. వారి ఆదాయం పెంచాం, శారీరక కష్టం తగ్గించాం, వారి జీవన ప్రమాణాలు పెంచాం.
చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు,వడ్రంగి, కంసాలి, కుమ్మరి, విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు తదితర... చేతివృత్తుల వారికి, కులవృత్తులవారికి అండగా నిలిచాం.
11 బీసీ ఫెడరేషన్లను బీసీ కార్పొరేషన్లుగా మార్చాం. నిధులు పుష్కలంగా ఇచ్చి కార్పోరేషన్ల బలోపేతం. మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహించాం.
ఎంబిసిలకు రూ100కోట్లతో ప్రత్యేకంగా కార్పోరేషన్ నెలకొల్పాం.
గత ఏడాదిగా వైసిపి ప్రభుత్వం వీటన్నింటిని నిర్వీర్యం చేసింది. నిధులను దారి మళ్లించి కార్పోరేషన్లకు తూట్లు పొడిచింది.
వైసిపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలు: వైసిపి ప్రభుత్వం రాగానే కృత్రిమ ఇసుక కొరత సృష్టించారు. 40లక్షల భవన కార్మికులు ఉపాధి కోల్పోయారు.
60మంది భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. (బాధితులకు కుటుంబానికి రూ లక్ష అందించి టిడిపి ఆదుకుంది).
ఇప్పుడు ఏడాదిగా రాష్ట్రంలో పనులు అన్నీ ఆపేశారు. అందుకే ఇతర రాష్ట్రాలకు కార్మికుల వలసలు. ఇప్పుడీ లాక్ డౌన్ తో అక్కడ కూడా ఉపాధి పోయింది. వలస కార్మికుల కష్టాలు హృదయ విదారకం. వారి బాధలు పరిష్కరించాలని లేఖలు రాశాం. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందనలేదు. వైసిపి ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే ఈ దుష్ఫలితాలు
భవన కార్మిక సంక్షేమ నిధికి లెక్కలు చెప్పడం లేదు. రూ1,900కోట్లు నిధి ఉంటే కేవలం రూ 250కోట్లే ఉందని చెప్పారు. కార్మికుల సంక్షేమ నిధిని కూడా దారి మళ్లించారు.
ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప శాశ్వతంగా మేళ్లు చేయడం లేదు.
కష్టకాలంలో పేదలను ఆదుకోడానికి చేతులు రావడం లేదు.
చిన్న రాష్ట్రం ఢిల్లీలో కుటుంబానికి రూ 5వేలు ఇచ్చింది. కేరళలో 17రకాల సరుకులు ఇంటింటికి ఇచ్చారు. మన రాష్ట్రంలో రూ5వేలు ఇవ్వాలని కోరినా స్పందన లేదు.
రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల్లో ఆవేదన. ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తులవారు, కులవృత్తుల వారు ఉపాధి కోల్పోయారు.
లాక్ డౌన్ లో కార్మికులకు అండగా ఉన్నవారికి అభినందనలు:
పొట్ట చేత పట్టుకుని వేల కిమీ కాలినడకన కార్మికులు వస్తున్నారు. వాళ్లకు అండగా ఉన్న దాతలకు అభినందనలు. పేద కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు, కోడిగుడ్లు, మాస్క్ లు పంచారు.
కార్మికులకు అండగా టిడిపి ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా ధైర్యంగా ఉండాలి.
టిఎన్ టియుసిని బలోపేతం చేద్దాం. నాయకత్వాన్ని పటిష్టం చేద్దాం. ప్రస్తుత కష్టకాలంలో కార్మికులకు అండగా ఉందాం. ఒక స్ఫూర్తితో ముందుకు పోదాం.
కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలి:
కరోనా లాక్ డౌన్ ల కారణంగా ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా 43కోట్ల కంపెనీలు సిక్ అయ్యాయి. 160కోట్ల కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. కార్మికుల ఆదాయం 60% పడిపోనుందని ఐఎల్ వో లెక్కలే పేర్కొన్నాయి.
వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, సేవారంగాల్లో కార్మికులు అనేకమంది జీవనోపాధికి గండిపడింది.
రాబోయే రోజుల్లో అన్నిరంగాల కార్మికులకు చాలా ఇబ్బందులు రానున్నాయి. వీటన్నింటినీ అధ్యయనం చేయాలి. సమస్యల పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వాటిని పరిష్కరించేలా పోరాడాలి.
పసుపు ‘‘జెండాలో కార్మిక చక్రం’’ స్ఫూర్తిగా పనిచేయాలి:
టిడిపి నాయకులు, కార్యకర్తలంతా, ఈ కష్టకాలంలో కార్మికులకు సంఘీభావంగా నిలబడాలి. వారికి అండగా నిలబడాలి. టిడిపి ‘‘జెండాలో కార్మికుల చక్రం’’ స్ఫూర్తిగా పని చేయాలి. మన ‘‘జెండాలో నాగలి స్ఫూర్తిగా’’ వ్యవసాయ కార్మికులకు అండగా ఉండాలని’’ ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.
ఈ సమావేశంలో కనీస వేతనాల సంఘం, ఆర్టీసి కార్మిక సంఘం, తాపీ వర్కర్ల సంఘం, ఆటో డ్రైవర్ల సంఘం, శానిటరీ వర్కర్ల అసోసియేషన్, కార్పెంటర్స్ అసోసియేషన్, మెకానిక్స్ అసోసియేషన్, మున్సిపల్ డ్రైవర్స్ అసోసియేషన్, మిల్క్ యూనియన్ వర్కర్లు, ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ అసోసియేషన్, రేషన్ డీలర్స్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వివిధ కార్మిక సంఘాల ప్రతినిధుల ఆవేదన:
ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, ‘‘చంద్రన్న బీమా వల్ల 3కోట్ల కుటుంబాల్లో ధైర్యం నింపిందని, వైసిపి ప్రభుత్వం వచ్చాక దానిని గాలికి వదిలేసి రోడ్డున పడేసిందని ఆవేదన చెందారు. మూతబడిన అన్నా కేంటిన్లను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. కార్మికులకు సిఎంఆర్ఎఫ్ కూడా పైసా ఇవ్వడం లేదు. ఒక భద్రతగాని, భరోసాగాని లేకుండా పోయింది. దేవుడిని వదులుకుని దయ్యాన్ని తెచ్చుకున్నామని ’’ వాపోయారు.
‘‘టిడిపి ఆవిర్భావం తర్వాతే రాష్ట్రంలో కార్మిక సంక్షేమం. అంతకు ముందు చాలా అస్తవ్యస్థ పరిస్థితులు ఉండేవి. టిడిపి వచ్చాకే కార్మికుల సంక్షేమానికి అనేక సంస్కరణలు తెచ్చారు. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 2ఏను సవరించి ఉపాధి కోల్పోయిన కార్మికుడు నేరుగా కోర్టుకు వెళ్లే హక్కు కల్పించారు. కార్మిక సంక్షేమ నిధి ఏర్పాటుతో ఎన్నో మేళ్లు జరిగాయి. కరవు భత్యం, గ్రాట్యుటి ఇచ్చారు. ఆపద్బందు పథకం తెచ్చారు. ప్రమాదాల నివారణకు దోహద పడ్డారు. పెరిగే ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకున్నారు, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు ఇచ్చారని, వీటన్నింటినీ మీరే (చంద్రబాబు) ప్రారంభించారని, వాటిని మళ్లీ పునరుద్దరించేలా మీరే చూడాలని ’’ ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
టిఎన్ టియుసి అధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి, గొట్టిముక్కల రఘురామ రాజు, శివ ప్రకాశ్, మిరియాల సుబ్రమణ్యం, కర్రి విష్ణురెడ్డి, నూతక్కి రామ్మోహన్, లీలా మాధవరావు, కనకదుర్గా భవాని, నాని తదితరులు మాట్లాడారు.
ఈ సమావేశంలో టిడిఎల్ పి ఉపనేతలు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌతు శిరీష, సోమిశెట్టి ఆంజనేయులు, పులివర్తి నాని తదితరులు ప్రసంగించారు.
టిడిపి ‘‘మే డే’’ తీర్మానాలు-డిమాండ్లు :
‘‘అన్నా కేంటిన్లు’’ వెంటనే పున: ప్రారంభించాలి.
‘‘చంద్రన్న బీమా’’ పథకం తక్షణమే పునరుద్దరించాలి.
శాండ్ మాఫియా అరాచకాలు అడ్డుకోవాలి. ఇసుక కొరత లేకుండా చూడాలి.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. సంక్షేమ నిధినుంచి ప్రతి భవన కార్మికుడి కుటుంబానికి రూ 10వేలు ఇవ్వాలి.
‘‘ఆదరణ’’ పథకం పునరుద్దరించాలి. చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదుకోవాలి. ఆధునిక పనిముట్లు పంపిణీ చేయాలి.
ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
ఆటో డ్రైవర్లకు రూ 10వేలు ఆర్ధిక సాయం అందించాలి
లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి.
కార్మికులు, ఉద్యోగులు, రేషన్ డీలర్లకు పిపిఈలు అందజేయాలి.
బయో మెట్రిక్ లేకుండా రేషన్ సరుకులు ఇంటింటికీ పంపిణీ చేయాలి
టిడిపి ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలన్నీ అమలు చేయాలి.
----