విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 

విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు


ఆత్మకూరు.  : మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వార్తలు సేకరించి తన మొబైల్ ఇంటర్నెట్ షాపు  అయినా తన ఆఫీసులో కూర్చుని సోమవారం ఉదయం వార్తలను జిల్లా కార్యాలయానికి  పంపించే క్రమంలో భారత్ టుడే రిపోర్టర్ ప్రసాద్పై ఆత్మకూరు రూరల్ ఎస్ఐ రోజా లతా దౌర్జన్యం చేసి లాఠీతో పలు విధాలుగా కొట్టారని అదే కాకుండా ఎవరివి నీవు అని బెదిరించి జీపులో ఎక్కాలని బలవంతం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ "సిఐ" పాపారావుకు సోమవారం తన కార్యాలయంలో ఆత్మకూర్& ఏఎస్ పేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు  బాధితుడైన భారత్ టుడే రిపోర్టర్ ప్రసాద్ వివరాల మేరకు తాను రోజులుగా వార్తలు సేకరించి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అధికారులకు చేరవేసే దిశలో అన్ని గ్రామాలు తిరిగి విజువల్స్ తీసుకొని ఆత్మకూరు పట్టణంలోని తన ఇంటర్నెట్ మొబైల్ షాప్ అయినా ఆఫీసు నుండి జిల్లా కార్యాలయానికి పంపించడం ఆనవాయితీ అని ఈ తరుణంలో సోమవారం మద్యం షాపుల విజువల్స్ తీసుకుని పలు ప్రజా సమస్యల విజువల్స్ తో పాటు జిల్లా కార్యాలయానికి పంపించే పనిలో ఉండగా  అక్కడికి చేరుకున్న రూరల్ ఎస్ఐ రోజాలతో షాప్ ఎందుకు తీశావని ఆగ్రహంతో విలేఖరి వద్దకు చేరుకుని దౌర్జన్యం ప్రదర్శించారని  నేను మీడియా ప్రతినిధిని వార్తలు సేకరించి హెడ్డాఫీసుకు పంపిస్తున్నానని అందుకు షాపు వద్దకు వచ్చానని ఓ పక్క చెబుతున్నా  తన వద్ద ఉన్న మీడియా ఐడి కార్డు  చూపిస్తున్న వారించకుండా చేతులు చూపించి చేతులపై లాఠీని ఘులిపించారని  అంతే కాకుండా నీ పైన కేసు నమోదు చేస్తాను పోలీస్స్టేషన్కు రావాలని భయాందోళన కల్పించడంతో   ఆ సమాచారాన్ని ఆ ప్రాంత మీడియా ప్రతినిధులకు ప్రసాద్ తెలపడంతో  హుటాహుటిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులు బాధితుడితో కలిసి సంఘటనపై సిఐ పాపారావుకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన సిఐ పాపారావు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇచ్చారు  ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో కూడా పలు మండలాల్లో మీడియా ప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యాలు పరిపాటిగా మారాయని ఇలాంటి వాటికి మీడియా భయపడదని మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై నిరంతరం పోరాడుతామని మీడియా ప్రతినిధుల సంఘం తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీడియా మిత్రులకు అండగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏఎస్ పేట  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు  వెంకట సుబ్బయ్య, చాంద్ బాషా, కరిముల్లా, జిలాని, మూర్తి,పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు