చార్లెస్ కాలనీలో కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చే కూరగాయలు పంపిణీ

*చార్లెస్ కాలనీలో కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చే కూరగాయలు పంపిణీ


వింజమూరు, మే 2 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలోని చార్లెస్ గిరిజన కాలనీవాసులకు శనివారం సాయంత్రం కొండా.గరుడయ్య, రామచంద్రయ్య, వెంకట సుబ్బయ్య (కే.జి.ఆర్.వి.యస్) చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వింజమూరు మండలంలో పలువురు దాతలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కూరగాయలు, వంట సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అందులో భాగంగా కొండా వారి కుటుంబసభ్యులు వారి కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ పేరిట నిరంతరాయంగా సేవలు అందించడం ప్రశంసించదగిన అంశమన్నారు. వై.సి.పి మండల కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి మాట్లాడుతూ కే.జీ.ఆర్.వి.యస్ ట్రస్ట్ బృందం ఈ విపత్కర పరిస్థితులలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో పేద ప్రజలను గుర్తిస్తూ లాక్ డౌన్ విధించినప్పటి నుండి నేటి వరకు కూడా విస్తృతంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటం వారి దయాగుణం, దాతృత్వాలకు నిదర్శనమన్నారు. మాజీ మండలాధ్యక్షుడు గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కొండా వారి కుటుంబానికి ఆది నుండి కూడా నియోజకవర్గంలో మంచి పేరు ఉందని, ఈ కరోనా కాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు వారు అన్ని వర్గాల ప్రజలకు వేలాది రూపాయలు వెచ్చించి నిత్యావసరాలు పంపిణీ చేస్తుతుండటం పట్ల వారి కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి చేరాయన్నారు. కే.జీ.ఆర్.వి.యస్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ పేద ప్రజలకు సహాయం చేయడం ఎంతగానో తృప్తినిస్తున్నదన్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు తమ సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కొండా.బాలసుబ్రహ్మణ్యం, కొండా.వెంకటేశ్వర్లు, కొండా.సుబ్బరాయుడు, కొండా.వెంకటేశ్వర్లు,  కొండా.వెంకట సుబ్బారావు, గంగిశెట్టి.హజరత్, చీతిరాల.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.