_నేనున్నాను...అంటూ బండి వేణుగోపాల్ రెడ్డి భరోసా_

*_నేనున్నాను...అంటూ బండి వేణుగోపాల్ రెడ్డి భరోసా_*


*పొదలకూరు పోలీసులకు సర్వేపల్లి ఎమ్మెల్యే చేతులు మీదుగా యూనిఫారం పంపిణీ*


*కరోనా కష్ట కాలంలో బండి వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం*


*వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో వేణుగోపాల్ రెడ్డి సేవలు వినియోగించుకుంటాం*


*సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి వెల్లడి*


*పొదలకూరు*


కరోనా లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రాపూరు మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వీనర్ దివంగత మహానేత బండి క్రిష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి  తన సొంత నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచి నేనున్నాను.. అంటూ భరోసా ఇస్తూ అదుకుంటున్నారు , ఇటీవల కాలంలో రాపూరు మండలం లోని 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు,పండ్లు పంపిణి చేశారు.అలాగే కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న రాపూరు,డక్కిలి,కండలేరు పోలీసులకు నిత్యావసర సరుకులు,యూనిఫామ్ పంపిణీ చేసి మీకు ఏ అవసరమైన నన్ను సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానాని ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 42 మందికి తన సొంత నిధులతో సమకూర్చిన యూనిఫామ్ ని శుక్రవారం పొదలకూరు పోలీస్ స్టేషన్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి, వైస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు నూకరాజు మాదన్మోహన్ రెడ్డి పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రావుతో కలిసి బండి వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బండి వేణుగోపాల్ రెడ్డి తండ్రి 
 స్వర్గీయ బండి క్రిష్ణా రెడ్డి రెడ్డి జ్ఞాపకర్థం ఆయన కుమారుడు వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని వెంకటగిరి నియోజకవర్గం కరోనా సాయం క్రింద రాపూరు మండలంలోని 25 వేల కుటుంబాలకు  నిత్యావసర వస్తువుల, కూరగాయలు,పండ్లు  పంపిణీ చైయడం,కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ శేభాష్ వేణుగోపాల్ రెడ్డి అని అనిపించుకుంటున్నారని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు,అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో మిగిలిన మండలాలు వెంకటాచలం, మనుబోలు, తోటపల్లి గూడూరు,ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి కూడా యూనిఫామ్ పంపిణీ చేయాలని బండి వేణుగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి కోరగా దానికి సానుకూలంగా,స్పందించినందుకు, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి,రాపూరు శ్రీనివాసులు పొదలకూరు ఎస్సై రహీంరెడ్డి తదితరులు ఉన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020