గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ ప్రెస్ మీట్
గుంటూరు, మే 1,(అంతిమ తీర్పు) : కంటైన్మేంట్ జోన్లలో ఇప్పటి వరకు కొత్త కేసులు నమోదు కాలేదని, గడచిన ఐదు రోజులలో 680 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 11 మందికి మాత్రమే పాజిటివ్ గా నమోదు అయ్యాయన్నారు. కంటైన్మేంట్ ఏరియాలలో ప్రజల సహకారం చాలా బాగుందన్నారు. పాజిటివ్ గా నిర్దారణ అయి చికిత్స అనంతరం నెగిటివ్ గా రిపోర్టు వచ్చి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయిన వారు ఇంటి వద్ద 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో వుండాలని తెలిపారు. గుంటూరు నగరంలోకి ఎవరు రాకుండా, నగరంలోని వారు బయటి ప్రాంతాలకు వెళ్ళకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. రెడ్ జోన్ ఏరియాలలో ఇప్పుడు వున్న సిసి కెమెరాలకు అదనంగా 200 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపై తిరిగే వాహనాలను సిజ్ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 4650 వాహనాలను సిజ్ చేయడం జరిగిందన్నారు. లేని విషయాలు ఉన్నట్లుగా ప్రచారం చేసిన ఒక ఆన్ లైన్ న్యూస్ ఛానల్ పై కేసు పెట్టడం కూడా జరిగిందని అర్బన్ ఎస్పీ తెలిపారు.