*టి.ఎన్.యస్.ఎఫ్ సారధిగా 'ప్రణవ్ ' నియామకం హర్షణీయం* బొల్లినేని.సురేంద్ర... వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): రాష్ట్ర తెలుగు నాడు స్టూడెండ్స్ ఫెడరేషన్ (టి.ఎస్.యస్.ఎఫ్) అధ్యక్షులుగా ప్రణవ్ గోపాల్ నియామకం హర్షణీయమని ఉదయగిరి నియోజకవర్గ తెలుగుయువత ప్రతినిధి బొల్లినేని.సురేంద్ర అన్నారు. గురువారం నాడు వింజమూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యపడుతుందన్నారు. రాజకీయ పరిణతి కలిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే ఏకైక వ్యక్తి నారా.చంద్రబాబు నాయుడు మాత్రమేనని కొనియాడారు. ఇటీవల మహానాడును ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన టి.డి.పి అధినేత చంద్రబాబు రానున్న రోజులలో పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర టి.ఎన్.యస్.ఎఫ్ అధ్యక్షుడుగా ప్రణవ్ గోపాల్ కు పట్టం కట్టారన్నారు. ప్రణవ్ గతంలో విశాఖ జిల్లా టి.ఎన్.యస్.ఎఫ్ శాఖ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసి పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలందించారన్నారు. విధ్యార్ధి సమస్యల సాధనలో విశాఖలో పోరాట పటిమను చాటిన ఘనతను ప్రణవ్ గోపాల్ దక్కించుకున్నారని సురేంద్ర కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుయువతను బలోపేతం చేసే శక్తి సామర్ధ్యాలు ప్రణవ్ మెదడులో మెండుగా ఉన్నాయన్నారు. ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో ఉదయగిరి నియోజకవర్గంలో టి.ఎస్.యస్.ఎఫ్, సి.బి.యన్ ఆర్మీ విభాగాలను మరింత బలోపేతం చేయనున్నామన్నారు. గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలపై రాజీలేని నిరంతర పోరాటం సాగిస్తామన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఓట్లు వేయాలని ప్రజల ముందుగు వెళ్ళి అడిగే హక్కు ఒక్క టి.డి.పి నేతలకే ఉందని బొల్లినేని.సురేంద్ర స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమార్గాలను ఆయుధాలుగా మలిచి గ్రామ స్థాయి నుండి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడతామన్నారు. వై.సి.పి ప్రభుత్వ కక్ష్యపూరిత విధానాలను ప్రజలందరూ క్షుణ్ణంగా గమనిస్తున్నారన్నారు. ఉదయగిరి కోటపై తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం తధ్యమని సురేంద్ర జోస్యం పలికారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ యం.యల్.ఏ బొల్లినేని.వెంకటరామారావు, యువనేతలు బొల్లినేని.ధనూష్ శ్రీనివాస్, కార్తీక్ ల నేతృత్వంలో ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహమును నింపనున్నామన్నారు. ఈ సమావేశంలో నందమూరి.బాలక్రిష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ఎస్.కే.షరీఫ్, టి.డి.పి అధికార ప్రతినిధి పెరుమాళ్ళు పాల్గొన్నారు.