*మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యం స్మగ్లింగ్* లారీని పట్టుకున్న పోలీసులు...... ఉదయగిరి, జూన్ 28 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యమును అక్రమార్కులు వివిద పద్దతులలో అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన ఉదయగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి సమీపంలో మొక్కజొన్న బస్తాల మధ్యలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీసులుకు అందింది. వెంటనే అప్రమత్తమైన సి.ఐ ఉప్పాల.సత్యనారాయణ, ఎస్.ఐ జ్యోతిలు నిఘా ఉంచి బియ్యంతో పాటుగా లారీని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణ, పరిశీలన నిమిత్తం ఈ సమాచారమును విజిలెన్స్ అధికారులకు తెలిపామని సి.ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉదయగిరి ప్రాంతంలో తరచూ ఏదో ఒక చోట అక్రమంగా రేషన్ బియ్యం లారీలు తరలుతూనే ఉన్నాయి. చౌక దుకాణాల నుండి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు నిరంతర నిఘా ఉంచాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారనే విమర్శలు బహిరంగ సత్యమే. ఆ శాఖ తీరు ' నిండా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టిన ' చందంగా తయారైందని పలువురు పెదవి విరుస్తున్నారు. డీలర్ల వద్ద నుండి అక్రమార్కులు యధేచ్చగా బియ్యం నిల్వలను పొంది అక్రమ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్బడుతున్నారు. లారీలు పట్టుబడిన సమయాలలో బియ్యం ఎక్కడి నుండి అక్రమంగా తరలుతున్నాయనే విషయాలు సంబంధిత రెవిన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకున్న దాఖలాలు చాలా అరుదుగానే ఉంటున్నాయి.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు