ల‌య‌న్స్ క్ల‌బ్ సేవ‌లు అజ‌రామ‌రం... * కృష్ణా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్ విజ‌య‌వాడ‌‌: సామాజి క బాధ్య‌త‌గా ఇప్ప‌టివ‌ర‌‌కు విద్య, వైద్యం వంటి విష‌యాల్లో విశేష సేవ‌లందిస్తోన్న ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ (ఎల్‌.సి.ఐ.ఎఫ్‌) మునుపెన్న‌డూ చూడ‌ని క‌రోనా వైర‌స్ వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ సేవ‌లందించేందుకు ముందుకు రావ‌డం ముదావ‌హ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏయండి ఇంతియాజ్ అన్నారు. ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం రూ.7.50ల‌క్ష‌లు విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, శానిటైజ‌ర్లును న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌కు ‌గురువారం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌‌లెక్ట‌ర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకూ విస్త‌రిస్తోన్న క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ మాన‌వ‌తా దృక్ప‌దంతో ముందుకు వ‌చ్చి జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రులు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లలో క‌రోనా వ్యాప్తి బారిన ప‌డ్డవారికి చికిత్స అంద‌జేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, శానిటైజ‌ర్లు అంద‌జేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. ఇప్ప‌టికే ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌నల్ సంస్థ సామాజిక బాధ్య‌త‌గా ఎన్నో సేవ‌ల‌ను అందించింద‌ని కొనియాడారు. ల‌య‌న్స్ జిల్లా గ‌వ‌ర్న‌ర్ వైపీసీ ప్ర‌సాద్ (జిల్లా 316-డి) మాట్లాడుతూ జిల్లా క‌లెక్ట‌ర్‌కు అందజేయ‌గా మిగిలిన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, శానిటైజ‌ర్లును అన్ని ల‌య‌న్స్ క్ల‌బ్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్లు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లలో పంపిణీ చేయ‌‌నున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పీఐడి ల‌య‌న్ చిగురుపాటి వ‌ర‌ప్ర‌సాద్‌,ఫ‌స్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ పుట్ట‌గుంట వెంక‌ట స‌తీష్‌కుమార్‌, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ దేవినేని జోనీకుమారి, ప‌లువురు ల‌య‌న్స్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు