*ఓట్లు తొలగింపు ప్రక్రియపై పునరాలోచించాలి* రఘునాధరెడ్డి.... వింజమూరు, జూలై 3 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని చాకలికొండ పంచాయితీ పరిధిలో ఓట్లును తొలగించే విషయంలో అధికారులు పునరాలోచించాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధం కావల్సి ఉంటుందని మాజీ సొసైటీ అధ్యక్షులు గొంగటి.రఘునాధరెడ్డి విజ్ఞప్తి చేశారు. చాకలికొండ పంచాయితీలో చాకలికొండతో పాటు బత్తినవారిపల్లి, గోళ్ళవారిపల్లి, పోలినాయుడుపల్లి ప్రాంతాలకు చెందిన వారి ఓట్లును ఫారం 7 ద్వారా తొలగించాలని చూడటం దారుణమన్నారు. పొట్టకూటి కోసం సీజన్లలో వలసలు వెళ్ళి స్థానికంగా ఉండే కుటుంబాలను పోషించుకునే వారి ఓట్లు తొలగించడం న్యాయమా అని రఘునాధరెడ్డి అధికారులను ప్రశ్నించారు. స్థానిక వై.సి.పి నేతలకు కొమ్ము కాస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ తదనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. 15 రోజుల ముందు నోటీసులు ఇంటికీ వెళ్ళి జారీ చేయాల్సిన సిబ్బంది ఈ నెల 2 వ తేదీన సచివాలయానికి పిలిపించి నోటీసులు ఇచ్చి 6 వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరడంలో ఆంతర్యమేమిటని రఘునాధరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుత కరోనా వైరస్ విస్తరణ సమయంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాలకు రావద్దంటూ ఒక వైపు తీవ్ర హెచ్చరికలు చేస్తూ, మరోవైపు ఇతర ప్రాంతాలలో వలసలు వెళ్ళిన వారిని ఇప్పటికప్పుడు విచారణ కోసం స్వగ్రామాలకు రావాలని కోరడం సహేతుకం కాదని హితువు పలికారు. అసలు ఏ ఉద్ధేశ్యంలో ఒకేసారి 231 కి పైగా ఓట్లు తొలగించాలని బావిస్తున్నారో ప్రజలకు కాకపోయినా ధర్మస్థానాలకైనా త్వరలోనే జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలి తప్ప ప్రతి విషయాన్ని ఎన్నికల ధోరణితో చూడటం, కక్ష్యపూరిత విధానాలను అవలంభించడం మంచి పద్దతి కాదని స్థానిక నేతలకు హితువు పలికారు. చాకలికొండ పంచాయితీ పరిధిలో ఓట్లు తొలగించాలని అధికారులు భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ విషయాలన్నింటినీ పక్కా ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్, రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమీషనర్ల దృష్టికి తీసుకెళ్ళనున్నామన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు