: *ఓటు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టడం న్యాయమా...!* వింజమూరు, జూలై 6 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఓట్లు విచారణ పేరుతో అధికారులు ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని మండలంలోని చాకలికొండ పంచాయితీ పరిధిలోని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో అధికారుల నోటీసులకు వివరణ ఇచ్చేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చామని, చివరికి వాయిదా వేయడంతో మా పరిస్థితి ఏంటని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివరాలలోకి వెళితే చాకలికొండ పంచాయితీ పరిధిలోని చాకలికొండ, గోళ్ళవారిపల్లి, బత్తినవారిపల్లి, పోలినాయుడుపల్లి గ్రామాలకు చెందిన పలువురు స్థానికంగా ఉండటం లేదని, వారి ఓట్లును తొలగించాలని ఆయా గ్రామాలకు చెందిన పలువురు ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేశారు. వీటిపై తహసిల్ధారు దాదాపుగా 231 మందికి నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ నెల 6 వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొంతమంది ఆదివారం సాయంత్రం నాటికి స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 6 వ తేదీ నిర్వహించనున్న విచారణను వాయిదా వేస్తున్నామని అధికారులు ప్రకటించారు. దీంతో ఖంగుతిన్న గ్రామస్థులు తహసిల్ధారు వద్దకు చేరుకుని ఈ సమయంలో ఇబ్బందులు పెడితే ఎలాగని ప్రశ్నించారు. గిట్టనివారు రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలపై తాము న్యాయస్థానాలను ఆశ్రయించనున్నామని స్పష్టం చేశారు. ఇలాంటి కక్ష్యపూరిత విధానాలు పచ్చనిపల్లెల్లో విష సంస్కృతికి బీజాలు వేసే ప్రమాదం ఉందని, ఇది మంచి పద్ధతి కాదని హితువు పలికారు. ఈ విషయాలన్నింటిపై తాము కోర్టుకు వెళతామని తేల్చి చెప్పారు. ప్రజల చేత శెభాష్ అనిపించుకుని ఎన్నికలలో ప్రజాదరణ పొందాలే తప్ప దొడ్డిదారిలో ప్రతిపక్ష ఓటర్లును తొలగించి గెలవాలనుకోవడం సిగ్గులేని చర్యగా అభివర్ణించారు. కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి తమను విచారణ పేరుతో స్వగ్రామాలకు పిలిపించి విచారణను వాయిదా వేయడం, మరలా రావాలని అధికారులు చెప్పడంలో ఆంతర్యమేమిటని వారు ఆవేదన చెందారు. జీవనభృతి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళామని, ఓట్లు తొలగించాలని చూడటం దారుణమన్నారు. ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు సాగుతామని గ్రామస్థులు తెలియజేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు